Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #24 Translated in Telugu

الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمُ ۘ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
ఎవరికైతే మేము గ్రంథాన్ని ప్రసాదించామో! వారు తమ పుత్రులను గుర్తించినట్లు, ఇతనిని (ముహమ్మద్ ను) కూడా గుర్తిస్తారు. ఎవరైతే, తమను తాము నష్టానికి గురి చేసుకుంటారో అలాంటి వారే విశ్వసించరు
وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
మరియు అల్లాహ్ పై అసత్యం కల్పించే వాని కంటే! లేదా, అల్లాహ్ సూచనలను తిరస్కరించే వాని కంటే, ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు
وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا أَيْنَ شُرَكَاؤُكُمُ الَّذِينَ كُنْتُمْ تَزْعُمُونَ
మరియు ఆరోజు మేము వారందరినీ సమావేశపరుస్తాము. ఆ తరువాత (అల్లాహ్ కు) సాటి కల్పించే (షిర్కు చేసే) వారితో: మీరు (దైవాలుగా) భావించిన (అల్లాహ్ కు సాటి కల్పించిన) ఆ భాగస్వాములు ఇప్పుడు ఎక్కడున్నారు?" అని అడుగుతాము
ثُمَّ لَمْ تَكُنْ فِتْنَتُهُمْ إِلَّا أَنْ قَالُوا وَاللَّهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِينَ
అప్పుడు వారికి: మా ప్రభువైన అల్లాహ్ సాక్షిగా! మేము ఆయన (అల్లాహ్) కు సాటి కల్పించేవారము (ముష్రికీన్) కాదు!" అని చెప్పడం తప్ప మరొక సాకు దొరకదు
انْظُرْ كَيْفَ كَذَبُوا عَلَىٰ أَنْفُسِهِمْ ۚ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ
చూడండి! వారు తమను గురించి తామే ఏ విధంగా అబద్ధాలు కల్పించు కున్నారో! మరియు ఏ విధంగా వారు కల్పించుకున్నవి (బూటకదైవాలు) మాయమై పోయాయో

Choose other languages: