Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #26 Translated in Telugu

وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا أَيْنَ شُرَكَاؤُكُمُ الَّذِينَ كُنْتُمْ تَزْعُمُونَ
మరియు ఆరోజు మేము వారందరినీ సమావేశపరుస్తాము. ఆ తరువాత (అల్లాహ్ కు) సాటి కల్పించే (షిర్కు చేసే) వారితో: మీరు (దైవాలుగా) భావించిన (అల్లాహ్ కు సాటి కల్పించిన) ఆ భాగస్వాములు ఇప్పుడు ఎక్కడున్నారు?" అని అడుగుతాము
ثُمَّ لَمْ تَكُنْ فِتْنَتُهُمْ إِلَّا أَنْ قَالُوا وَاللَّهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِينَ
అప్పుడు వారికి: మా ప్రభువైన అల్లాహ్ సాక్షిగా! మేము ఆయన (అల్లాహ్) కు సాటి కల్పించేవారము (ముష్రికీన్) కాదు!" అని చెప్పడం తప్ప మరొక సాకు దొరకదు
انْظُرْ كَيْفَ كَذَبُوا عَلَىٰ أَنْفُسِهِمْ ۚ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ
చూడండి! వారు తమను గురించి తామే ఏ విధంగా అబద్ధాలు కల్పించు కున్నారో! మరియు ఏ విధంగా వారు కల్పించుకున్నవి (బూటకదైవాలు) మాయమై పోయాయో
وَمِنْهُمْ مَنْ يَسْتَمِعُ إِلَيْكَ ۖ وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَنْ يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِنْ يَرَوْا كُلَّ آيَةٍ لَا يُؤْمِنُوا بِهَا ۚ حَتَّىٰ إِذَا جَاءُوكَ يُجَادِلُونَكَ يَقُولُ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు నీ (మాటలు) వింటున్నట్లు (నటించే) వారున్నారు. మరియు వారు దానిని అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసి వున్నాము మరియు వారి చెవులకు చెవుడు పట్టించి వున్నాము. మరియు వారు ఏ అద్భుత సంకేతాన్ని చూసినా దానిని విశ్వసించరు. చివరకు వారు నీ వద్దకు వచ్చి, నీతో వాదులాడేటప్పుడు, వారిలో సత్యాన్ని తిరస్కరించేవారు: ఇవి కేవలం పూర్వీకుల కట్టుకథలు మాత్రమే!" అని అంటారు
وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْأَوْنَ عَنْهُ ۖ وَإِنْ يُهْلِكُونَ إِلَّا أَنْفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
మరియు వారు ఇతరులను అతని (ప్రవక్త) నుండి ఆపుతారు. మరియు స్వయంగా తాము కూడా అతనికి దూరంగా ఉంటారు. మరియు ఈ విధంగా వారు తమకు తామే నాశనం చేసుకుంటున్నారు. కాని వారది గ్రహించటం లేదు

Choose other languages: