Quran Apps in many lanuages:

Surah Al-Ahqaf Ayahs #22 Translated in Telugu

أُولَٰئِكَ الَّذِينَ حَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِي أُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ ۖ إِنَّهُمْ كَانُوا خَاسِرِينَ
వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవ సమాజాలలో, ఇలాంటి వారి మీదనే (అల్లాహ్) వాక్కు (శిక్ష) సత్యమయింది. నిశ్చయంగా, వారే నష్టపడిన వారయ్యారు
وَلِكُلٍّ دَرَجَاتٌ مِمَّا عَمِلُوا ۖ وَلِيُوَفِّيَهُمْ أَعْمَالَهُمْ وَهُمْ لَا يُظْلَمُونَ
ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మలకు తగిన స్థానాలుంటాయి. మరియు ఇది వారి కర్మలకు తగినట్లుగా పూర్తి ప్రతిఫలమివ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు
وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَذْهَبْتُمْ طَيِّبَاتِكُمْ فِي حَيَاتِكُمُ الدُّنْيَا وَاسْتَمْتَعْتُمْ بِهَا فَالْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنْتُمْ تَسْتَكْبِرُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَفْسُقُونَ
మరియు ఆ రోజు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందుకు తెచ్చి, వారితో (ఇలా అనబడుతుంది): మీరు, మీ ఇహలోక జీవితంలో మీ భోగభాగ్యాలను తరిగించుకున్నారు మరియు వాటిని బాగా అనుభవించారు; కావున మీరు ఏ హక్కూ లేకుండా భూమిలో ప్రదర్శించిన అహంకారానికి మరియు మీరు చేసిన అవిధేయతకు ప్రతిఫలంగా, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది
وَاذْكُرْ أَخَا عَادٍ إِذْ أَنْذَرَ قَوْمَهُ بِالْأَحْقَافِ وَقَدْ خَلَتِ النُّذُرُ مِنْ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
మరియు జ్ఞాపకం చేసుకోండి, ఆద్ జాతి సోదరుడు (హూద్) ఇసుక దిబ్బలలో ఉన్న తన జాతి వారిని హెచ్చరించింది మరియు అలా హెచ్చరించేవారు అతనికి పూర్వం కూడా వచ్చారు మరియు అతని తరువాత కూడా వచ్చారు. (అతను ఇలా అన్నాడు): మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించకండి. (అలా చేస్తే) నిశ్చయంగా, ఆ గొప్ప దినమున మీపై పడబోయే, ఆ శిక్షను గురించి నేను భయపడుతున్నాను
قَالُوا أَجِئْتَنَا لِتَأْفِكَنَا عَنْ آلِهَتِنَا فَأْتِنَا بِمَا تَعِدُنَا إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ
వారిలా అన్నారు: మా దేవతల నుండి మమ్మల్ని దూరం చేయటానికా నీవు వచ్చింది? నీవు సత్యవంతుడవే అయితే నీవు బెదిరించే (ఆ శిక్షను) తీసుకురా

Choose other languages: