Quran Apps in many lanuages:

Surah Al-Ahqaf Ayahs #21 Translated in Telugu

وَالَّذِي قَالَ لِوَالِدَيْهِ أُفٍّ لَكُمَا أَتَعِدَانِنِي أَنْ أُخْرَجَ وَقَدْ خَلَتِ الْقُرُونُ مِنْ قَبْلِي وَهُمَا يَسْتَغِيثَانِ اللَّهَ وَيْلَكَ آمِنْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ فَيَقُولُ مَا هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
మరియు ఎవడైనా తన తల్లిదండ్రులతో ఇలా అంటే: ఛీ పొండి (ఉఫ్)! నేను (గోరీ నుండి సజీవిగా) లేపబడతానని మీరు నన్ను బెదిరిస్తున్నారా? మరియు వాస్తవానికి, నాకు ముందు ఎన్నో తరాలు గతించాయి. (కాని తిరిగి లేపబడలేదు కదా)?" మరియు వారిద్దరూ అల్లాహ్ సహాయం కోరుతూ ఇలా అంటారు: ఓ దౌర్భాగ్యుడా! విశ్వసించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం!" అప్పుడు వాడు ఇలా అంటాడు: ఇవన్నీ కేవలం పాతకాలపు కట్టుకథలు తప్ప మరేమీ కావు
أُولَٰئِكَ الَّذِينَ حَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِي أُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ ۖ إِنَّهُمْ كَانُوا خَاسِرِينَ
వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవ సమాజాలలో, ఇలాంటి వారి మీదనే (అల్లాహ్) వాక్కు (శిక్ష) సత్యమయింది. నిశ్చయంగా, వారే నష్టపడిన వారయ్యారు
وَلِكُلٍّ دَرَجَاتٌ مِمَّا عَمِلُوا ۖ وَلِيُوَفِّيَهُمْ أَعْمَالَهُمْ وَهُمْ لَا يُظْلَمُونَ
ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మలకు తగిన స్థానాలుంటాయి. మరియు ఇది వారి కర్మలకు తగినట్లుగా పూర్తి ప్రతిఫలమివ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు
وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَذْهَبْتُمْ طَيِّبَاتِكُمْ فِي حَيَاتِكُمُ الدُّنْيَا وَاسْتَمْتَعْتُمْ بِهَا فَالْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنْتُمْ تَسْتَكْبِرُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَفْسُقُونَ
మరియు ఆ రోజు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందుకు తెచ్చి, వారితో (ఇలా అనబడుతుంది): మీరు, మీ ఇహలోక జీవితంలో మీ భోగభాగ్యాలను తరిగించుకున్నారు మరియు వాటిని బాగా అనుభవించారు; కావున మీరు ఏ హక్కూ లేకుండా భూమిలో ప్రదర్శించిన అహంకారానికి మరియు మీరు చేసిన అవిధేయతకు ప్రతిఫలంగా, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది
وَاذْكُرْ أَخَا عَادٍ إِذْ أَنْذَرَ قَوْمَهُ بِالْأَحْقَافِ وَقَدْ خَلَتِ النُّذُرُ مِنْ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
మరియు జ్ఞాపకం చేసుకోండి, ఆద్ జాతి సోదరుడు (హూద్) ఇసుక దిబ్బలలో ఉన్న తన జాతి వారిని హెచ్చరించింది మరియు అలా హెచ్చరించేవారు అతనికి పూర్వం కూడా వచ్చారు మరియు అతని తరువాత కూడా వచ్చారు. (అతను ఇలా అన్నాడు): మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించకండి. (అలా చేస్తే) నిశ్చయంగా, ఆ గొప్ప దినమున మీపై పడబోయే, ఆ శిక్షను గురించి నేను భయపడుతున్నాను

Choose other languages: