Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #11 Translated in Telugu

لَقَدْ كَانَ فِي يُوسُفَ وَإِخْوَتِهِ آيَاتٌ لِلسَّائِلِينَ
వాస్తవానికి, యూసుఫ్ మరియు అతని సోదరుల (గాథలో) అడిగే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి
إِذْ قَالُوا لَيُوسُفُ وَأَخُوهُ أَحَبُّ إِلَىٰ أَبِينَا مِنَّا وَنَحْنُ عُصْبَةٌ إِنَّ أَبَانَا لَفِي ضَلَالٍ مُبِينٍ
అప్పుడు వారు (యూసుఫ్ సోదరులు) పరస్పరం ఇలా అనుకున్నారు: మనది ఒక బలమైన వర్గం, అయినప్పటికీ యూసుఫ్ మరియు అతన సోదరుడు (బెన్యామీన్) అంటే మన తండ్రికి మన కంటే ఎక్కువ ప్రేమ. నిశ్చయంగా, మన తండ్రి స్పష్టమైన తప్పుడు అభిప్రాయంలో ఉన్నాడు
اقْتُلُوا يُوسُفَ أَوِ اطْرَحُوهُ أَرْضًا يَخْلُ لَكُمْ وَجْهُ أَبِيكُمْ وَتَكُونُوا مِنْ بَعْدِهِ قَوْمًا صَالِحِينَ
(వారిలో ఒకడు ఇలా అన్నాడు): యూసుఫ్ ను చంపండి, లేదా అతణ్ణి ఎక్కడైనా ఒంటరిగా వదలి పెట్టండి. ఇలా చేసినట్లయితే మీ తండ్రి ధ్యాస (ప్రేమ) కేవలం మీ వైపునకే మరలుతుంది. ఆ తరువాత మీరు (ప్రాయశ్చిత్తం చేసి) సద్వర్తనులుగా ప్రవర్తించండి
قَالَ قَائِلٌ مِنْهُمْ لَا تَقْتُلُوا يُوسُفَ وَأَلْقُوهُ فِي غَيَابَتِ الْجُبِّ يَلْتَقِطْهُ بَعْضُ السَّيَّارَةِ إِنْ كُنْتُمْ فَاعِلِينَ
వారిలో మరొకడు అన్నాడు: యూసుఫ్ ను చంపకండి. మీరు (ఏదైనా) చేయాలనే అనుకుంటే! అతనిని ఒక లోతైన బావిలో పడవేయండి, ఎవరైనా బాటసారులు అతనిని తీసుకొని పోవచ్చు
قَالُوا يَا أَبَانَا مَا لَكَ لَا تَأْمَنَّا عَلَىٰ يُوسُفَ وَإِنَّا لَهُ لَنَاصِحُونَ
వారు అన్నారు: నాన్నా! నీవు యూసుఫ్ విషయంలో మమ్మల్ని ఎందుకు నమ్మవు? వాస్తవానికి మేము అతని శ్రేయోభిలాషులము

Choose other languages: