Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #25 Translated in Telugu

وَقَالَ الَّذِي اشْتَرَاهُ مِنْ مِصْرَ لِامْرَأَتِهِ أَكْرِمِي مَثْوَاهُ عَسَىٰ أَنْ يَنْفَعَنَا أَوْ نَتَّخِذَهُ وَلَدًا ۚ وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي الْأَرْضِ وَلِنُعَلِّمَهُ مِنْ تَأْوِيلِ الْأَحَادِيثِ ۚ وَاللَّهُ غَالِبٌ عَلَىٰ أَمْرِهِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
మరియు అతనిని కొన్న ఈజిప్టు (మిస్ర్) వాసి తన భార్యతో అన్నాడు: ఇతనిని గౌరవంగా ఉంచుకో! బహుశా ఇతను మనకు లాభదాయకుడు కావచ్చు! లేదా మనం ఇతనిని కొడుకుగా చేసుకోవచ్చు!" మరియు ఈ విధంగా మేము యూసుఫ్ ను భూమిపై స్థానమిచ్చి అతనికి సంఘనల గూఢార్థాన్ని (స్వప్నాల భావాన్ని) తెలియజేసే (విద్యను) నేర్పాము. అల్లాహ్ తన కార్యాన్ని పూర్తి చేయగల శక్తి కలిగి ఉన్నాడు, కాని చాలా మందికి ఇది తెలియదు
وَلَمَّا بَلَغَ أَشُدَّهُ آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
మరియు అతను తన నిండు యవ్వనానికి చేరుకున్నపుడు, మేము అతనికి వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలము నొసంగుతాము
وَرَاوَدَتْهُ الَّتِي هُوَ فِي بَيْتِهَا عَنْ نَفْسِهِ وَغَلَّقَتِ الْأَبْوَابَ وَقَالَتْ هَيْتَ لَكَ ۚ قَالَ مَعَاذَ اللَّهِ ۖ إِنَّهُ رَبِّي أَحْسَنَ مَثْوَايَ ۖ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
మరియు అతను నివసించే ఇంటి స్త్రీ అతనిని మోహించి అతని మనస్సును చలింప జేయగోరి తలుపులు మూసి, అతనితో: (నా వద్దకు) రా!" అని పిలిచింది. అతను : నేను అల్లాహ్ శరణు గోరుతున్నాను! నిశ్చయంగా ఆయన! నా ప్రభువు, నాకు మంచి స్థానాన్ని ప్రసాదించాడు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు." అని పలికాడు
وَلَقَدْ هَمَّتْ بِهِ ۖ وَهَمَّ بِهَا لَوْلَا أَنْ رَأَىٰ بُرْهَانَ رَبِّهِ ۚ كَذَٰلِكَ لِنَصْرِفَ عَنْهُ السُّوءَ وَالْفَحْشَاءَ ۚ إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُخْلَصِينَ
మరియు వాస్తవానికి, ఆమె అతనిని ఆశించింది. మరియు అతను కూడా ఆమె కోరికకు మొగ్గి ఉండేవాడే! ఒకవేల అతను తన ప్రభువు యొక్క నిదర్శనాన్ని చూసి ఉండక పోతే! ఈ విధంగా జరిగింది, మేము పాపం మరియు అశ్లీలతను అతని నుండి దూరంగా ఉంచటానికి. నిశ్చయంగా, అతను మేము ఎన్నుకున్న దాసులలో ఒకడు
وَاسْتَبَقَا الْبَابَ وَقَدَّتْ قَمِيصَهُ مِنْ دُبُرٍ وَأَلْفَيَا سَيِّدَهَا لَدَى الْبَابِ ۚ قَالَتْ مَا جَزَاءُ مَنْ أَرَادَ بِأَهْلِكَ سُوءًا إِلَّا أَنْ يُسْجَنَ أَوْ عَذَابٌ أَلِيمٌ
మరియు వారిద్దరు (ఒకరి వెనుక ఒకరు) తలుపు వైపుకు పరుగెత్తారు. ఆమె అతని అంగిని వెనుక నుండి లాగి చించింది. వారిద్దరు తలుపు వద్ద ఆమె భర్తను చూశారు. ఆమె (తన భర్తతో) అన్నది: నీ భార్యను చెరుపాలని తలచిన వానికి చెరసాలలో ఉంచటం, లేదా బాధాకరమైన శిక్ష విధించటం తప్ప, మరొక శిక్ష ఏముంటుంది

Choose other languages: