Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #109 Translated in Telugu

وَكَأَيِّنْ مِنْ آيَةٍ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ يَمُرُّونَ عَلَيْهَا وَهُمْ عَنْهَا مُعْرِضُونَ
మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఎన్ని సూచనలను వారు చూస్తూ ఉన్నారు. అయినా వారు (వాటిని గమనించలేక) వాటి నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు
وَمَا يُؤْمِنُ أَكْثَرُهُمْ بِاللَّهِ إِلَّا وَهُمْ مُشْرِكُونَ
మరియు వారిలో చాలా మంది అల్లాహ్ ను విశ్వసించి కూడా, ఆయనకు సాటి కల్పించే వారున్నారు
أَفَأَمِنُوا أَنْ تَأْتِيَهُمْ غَاشِيَةٌ مِنْ عَذَابِ اللَّهِ أَوْ تَأْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
ఏమిటి? అల్లాహ్ శిక్ష తమను క్రమ్ముకోకుండా, వారు సురక్షితంగా ఉండగలరని, వారు భావిస్తున్నారా? లేదా వారికి తెలియకుండానే అకస్మాత్తుగా (అంతిమ) ఘడియ రాదని వారు భావిస్తున్నారా
قُلْ هَٰذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّهِ ۚ عَلَىٰ بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي ۖ وَسُبْحَانَ اللَّهِ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
(వారితో) అను: ఇదే నా మార్గం. నేనూ మరియు నన్ను అనుసరించేవారూ, నిశ్చిత జ్ఞానంతో మిమ్మల్ని అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు మరియు నేను ఆయనకు సాటి కల్పించే వారిలోని వాడను కాను
وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ إِلَّا رِجَالًا نُوحِي إِلَيْهِمْ مِنْ أَهْلِ الْقُرَىٰ ۗ أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۗ وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ لِلَّذِينَ اتَّقَوْا ۗ أَفَلَا تَعْقِلُونَ
మరియు మేము నీ కంటే పూర్వం దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపిన వారందరూ పురుషులే, వారూ నగరవాసులలోని వారే. ఏమీ? వీరు భూమిలో సంచారం చేయలేదా, తమ పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి ? దైవభీతి గలవారికి పరలోక వాసమే ఎంతో మేలైనది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా

Choose other languages: