Quran Apps in many lanuages:

Surah Yunus Ayahs #34 Translated in Telugu

هُنَالِكَ تَبْلُو كُلُّ نَفْسٍ مَا أَسْلَفَتْ ۚ وَرُدُّوا إِلَى اللَّهِ مَوْلَاهُمُ الْحَقِّ ۖ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ
అక్కడ ప్రతి వ్యక్తీ తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ యజమాని అయిన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు మరియు వారు కల్పించుకున్న (బూటకదైవాలన్నీ) వారిని వీడి పోతాయి
قُلْ مَنْ يَرْزُقُكُمْ مِنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّنْ يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَنْ يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَنْ يُدَبِّرُ الْأَمْرَ ۚ فَسَيَقُولُونَ اللَّهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ
వారిని అడుగు: ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా
فَذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمُ الْحَقُّ ۖ فَمَاذَا بَعْدَ الْحَقِّ إِلَّا الضَّلَالُ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ
ఆయనే అల్లాహ్! మీ నిజమైన ప్రభువు. అయితే సత్యం తరువాత, మార్గభ్రష్టత్వం తప్ప మిగిలేదేమిటి? అయితే మీరు ఎందుకు (సత్యం నుండి) తప్పించబడుతున్నారు
كَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ فَسَقُوا أَنَّهُمْ لَا يُؤْمِنُونَ
ఈ విధంగా దుష్టులైన వారి విషయంలో వారెన్నడూ విశ్వసించరని, నీ ప్రభువు అన్న మాట నిజమయింది
قُلْ هَلْ مِنْ شُرَكَائِكُمْ مَنْ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۚ قُلِ اللَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
వారిని అడుగు: మీరు అల్లాహ్ కు సాటిగా కల్పించుకున్న వారిలో సృష్టిని మొదటిసారి ఆరంభించేవాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా?" ఇలా అను: సృష్టి ఆరంభించేవాడు, దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడూ కేవలం అల్లాహ్ మాత్రమే! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)

Choose other languages: