Quran Apps in many lanuages:

Surah Ta-Ha Ayahs #52 Translated in Telugu

إِنَّا قَدْ أُوحِيَ إِلَيْنَا أَنَّ الْعَذَابَ عَلَىٰ مَنْ كَذَّبَ وَتَوَلَّىٰ
నిశ్చయంగా, ఎవడైతే సత్యాన్ని తిరస్కరించి వెనుదిరిగి పోతాడో, అతనికి కఠినశిక్ష తప్పక ఉంటుంది` అని వాస్తవానికి మాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలుపబడింది
قَالَ فَمَنْ رَبُّكُمَا يَا مُوسَىٰ
(ఫిర్ఔన్) అన్నాడు: ఓ మూసా! మీ ఇరువురి ప్రభువు ఎవరు
قَالَ رَبُّنَا الَّذِي أَعْطَىٰ كُلَّ شَيْءٍ خَلْقَهُ ثُمَّ هَدَىٰ
(మూసా) జవాబిచ్చాడు: ప్రతి దానికి దాని రూపాన్నిచ్చి, తరువాత దానికి మార్గదర్శకత్వం చేసేవాడే మా ప్రభువు
قَالَ فَمَا بَالُ الْقُرُونِ الْأُولَىٰ
(ఫిర్ఔన్) అన్నాడు: అయితే పూర్వం గతించిన తరాల వారి సంగతి ఏమిటి
قَالَ عِلْمُهَا عِنْدَ رَبِّي فِي كِتَابٍ ۖ لَا يَضِلُّ رَبِّي وَلَا يَنْسَى
(మూసా) జవాబిచ్చాడు: వాటి జ్ఞానం నా ప్రభువు వద్ద ఒక గ్రంథంలో (వ్రాయబడి) వుంది. నా ప్రభువు పొరపాటు చేయడు మరియు మరువడు కూడాను

Choose other languages: