Quran Apps in many lanuages:

Surah Maryam Ayahs #77 Translated in Telugu

وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَيُّ الْفَرِيقَيْنِ خَيْرٌ مَقَامًا وَأَحْسَنُ نَدِيًّا
మరియు స్పష్టమైన మా సూచనలను వారికి చదివి వినిపించినపుడు, సత్యతిరస్కారులు విశ్వాసులతో అంటారు: మన రెండు వర్గాల వారిలో ఎవరి వర్గం మంచి స్థితిలో ఉంది మరియు ఎవరి సభ ఉత్తమమైనది
وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ مِنْ قَرْنٍ هُمْ أَحْسَنُ أَثَاثًا وَرِئْيًا
మరియు వారికి ముందు మేము ఎన్నో తరాలను (వంశాలను) నాశనం చేశాము; వారు వీరి కంటే ఎక్కువ సిరిసంపదలు మరియు బాహ్య ఆడంబరాలు గలవారై ఉండిరి
قُلْ مَنْ كَانَ فِي الضَّلَالَةِ فَلْيَمْدُدْ لَهُ الرَّحْمَٰنُ مَدًّا ۚ حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ إِمَّا الْعَذَابَ وَإِمَّا السَّاعَةَ فَسَيَعْلَمُونَ مَنْ هُوَ شَرٌّ مَكَانًا وَأَضْعَفُ جُنْدًا
వారితో అను: మార్గభ్రష్టత్వంలో పడి వున్నవానికి, అనంత కరుణామయుడు, ఒక సమయం వరకు వ్యవధి నిస్తూ ఉంటాడు. తుదకు వారు తమకు వాగ్దానం చేయబడిన దానిని చూసినపుడు, అది (కఠినమైన) శిక్షనో కావచ్చు లేదా అంతిమ ఘడియనో కావచ్చు! హీనస్థితిలో ఉన్న వాడెవడో మరియు బలహీన వర్గం (సేన) ఎవరిదో వారికి తెలియగలదు
وَيَزِيدُ اللَّهُ الَّذِينَ اهْتَدَوْا هُدًى ۗ وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِنْدَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ مَرَدًّا
మరియు (దానికి ప్రతిగా) మార్గదర్శకత్వం పొందిన వారికి, అల్లాహ్ మార్గదర్శత్వంలో వృద్ధిని ప్రసాదిస్తాడు. చిరస్థాయిగా ఉండిపోయే సత్కార్యాలే, నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా ఉత్తమమైనవి మరియు పర్యవసానం దృష్ట్యా కూడా ఉత్తమమైనవి
أَفَرَأَيْتَ الَّذِي كَفَرَ بِآيَاتِنَا وَقَالَ لَأُوتَيَنَّ مَالًا وَوَلَدًا
ఏమీ? మా సూచనలను తిరస్కరించి: నిశ్చయంగా, నాకు ధనసంపదలూ మరియు సంతానం ఇవ్వబడుతూనే ఉంటాయి." అని పలికే వానిని నీవు చూశావా

Choose other languages: