Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #84 Translated in Telugu

وَلَكُمْ فِيهَا مَنَافِعُ وَلِتَبْلُغُوا عَلَيْهَا حَاجَةً فِي صُدُورِكُمْ وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُونَ
మరియు వాటి వల్ల మీకు ఇతర లాభాలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా మీ హృదయాలు కోరిన చోట్లకు పోవటానికి ఉపయోగపడతాయి మరియు వాటి మీద మరియు పడవల మీద మీరు తీసుకు పోబడతారు
وَيُرِيكُمْ آيَاتِهِ فَأَيَّ آيَاتِ اللَّهِ تُنْكِرُونَ
మరియు (ఈ విధంగా) ఆయన మీకు తన సూచనలను (ఆయాత్ లను) చూపుతున్నాడు. అయితే అల్లాహ్ యొక్క ఏ ఏ సూచనలను (ఆయాత్ లను) మీరు నిరాకరిస్తారు
أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ كَانُوا أَكْثَرَ مِنْهُمْ وَأَشَدَّ قُوَّةً وَآثَارًا فِي الْأَرْضِ فَمَا أَغْنَىٰ عَنْهُمْ مَا كَانُوا يَكْسِبُونَ
ఏమీ? వీరు భూమిలో సంచరించలేదా? అప్పుడు వీరికి పూర్వం గతించిన వారి గతి ఏమయిందో కనిపించలేదా? వారు వీరి కంటే సంఖ్యాపరంగా అధికులు మరియు వీరి కంటే ఎక్కువ బలవంతులు మరియు భూమిలో (ఎక్కువ) చిహ్నాలు వదలి పోయారు, కాని వారి సంపాదన వారికి ఏ విధంగానూ పనికి రాలేదు
فَلَمَّا جَاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ فَرِحُوا بِمَا عِنْدَهُمْ مِنَ الْعِلْمِ وَحَاقَ بِهِمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
ఎందుకంటే! వారి సందేశహరులు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినప్పుడు, వారు తమ దగ్గరున్న జ్ఞానానికి గర్వపడ్డారు; కాబట్టి వారు దేనిని గురించి పరిహాసాలాడుతూ ఉన్నారో అదే వారిని చుట్టుకున్నది
فَلَمَّا رَأَوْا بَأْسَنَا قَالُوا آمَنَّا بِاللَّهِ وَحْدَهُ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهِ مُشْرِكِينَ
ఆ తరువాత మా శిక్షను చూసినప్పుడు వారు ఇలా అన్నారు: మేము అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము మరియు మేము (అల్లాహ్ కు) సాటి కల్పిస్తూ వచ్చిన భాగస్వాములను తిరస్కరిస్తున్నాము

Choose other languages: