Quran Apps in many lanuages:

Surah Fussilat Ayahs #8 Translated in Telugu

بَشِيرًا وَنَذِيرًا فَأَعْرَضَ أَكْثَرُهُمْ فَهُمْ لَا يَسْمَعُونَ
(స్వర్గపు) శుభవార్తనిచ్చేదిగా మరియు హెచ్చరించేదిగా; అయినా చాలా మంది దీని పట్ల విముఖత చూపుతున్నారు, కాబట్టి వారు వినటం లేదు
وَقَالُوا قُلُوبُنَا فِي أَكِنَّةٍ مِمَّا تَدْعُونَا إِلَيْهِ وَفِي آذَانِنَا وَقْرٌ وَمِنْ بَيْنِنَا وَبَيْنِكَ حِجَابٌ فَاعْمَلْ إِنَّنَا عَامِلُونَ
మరియు వారు ఇలా అన్నారు: నీవు దేనివైపునకైతే మమ్మల్ని పిలుస్తున్నావో, దాని పట్ల మా హృదయాల మీద తెరలు కప్పబడి ఉన్నాయి; మరియు మా చెవులలో చెవుడు ఉంది మరియు నీకూ మాకూ మధ్య ఒక అడ్డు తెర ఉంది; కావున నీవు నీ పని చేయి, మేము మా పని చేస్తాము
قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ فَاسْتَقِيمُوا إِلَيْهِ وَاسْتَغْفِرُوهُ ۗ وَوَيْلٌ لِلْمُشْرِكِينَ
(ఓ ప్రవక్తా!) ఇలా అను: నిశ్చయంగా నేను కూడా మీలాంటి ఒక మానవుణ్ణి మాత్రమే! నాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: `నిశ్చయంగా, మీ ఆరాధ్య దేవుడు, ఒకే ఒక్క దేవుడు (అల్లాహ్); కావున మీరు నేరుగా ఆయన వైపునకే మరలండి మరియు ఆయననే క్షమాపణకై వేడుకోండి.` మరియు ఆయన (అల్లాహ్) కు సాటి కల్పించే వారికి వినాశం ఉంది
الَّذِينَ لَا يُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ
వారికి, ఎవరైతే విధిదానం (జకాత్) ఇవ్వరో మరియు పరలోకాన్ని తిరస్కరిస్తారో
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారికి ఎడతెగని ప్రతిఫలం (స్వర్గం) ఉంటుంది

Choose other languages: