Quran Apps in many lanuages:

Surah Fatir Ayahs #10 Translated in Telugu

إِنَّ الشَّيْطَانَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوهُ عَدُوًّا ۚ إِنَّمَا يَدْعُو حِزْبَهُ لِيَكُونُوا مِنْ أَصْحَابِ السَّعِيرِ
నిశ్చయంగా, షైతాన్ మీ శత్రువు, కావున మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి. నిశ్చయంగా, వాడు తన అనుచరులను (భగభగ మండే) అగ్నివాసులవటానికే ఆహ్వానిస్తూ ఉంటాడు
الَّذِينَ كَفَرُوا لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۖ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ
ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారికి కఠినమైన శిక్ష పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం (స్వర్గం) కూడా ఉంటాయి
أَفَمَنْ زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ فَرَآهُ حَسَنًا ۖ فَإِنَّ اللَّهَ يُضِلُّ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ ۖ فَلَا تَذْهَبْ نَفْسُكَ عَلَيْهِمْ حَسَرَاتٍ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا يَصْنَعُونَ
ఏమీ? తన దుష్కార్యాలు తనకు ఆకర్షణీయంగా కనబడేటట్లు చేయబడి నందుకు, ఎవడైతే వాటిని మంచి కార్యాలుగా భావిస్తాడో! (అతడు సన్మార్గంలో ఉన్న వాడితో సమానుడు కాగలడా)? నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వానిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు మరియు తాను కోరిన వానికి మార్గదర్శకత్వం చేస్తాడు. కావున నీవు వారి కొరకు చింతించి నిన్ను నీవు దుఃఖానికి గురి చేసుకోకు. నిశ్చయంగా, వారి కర్మలన్నీ అల్లాహ్ కు బాగా తెలుసు
وَاللَّهُ الَّذِي أَرْسَلَ الرِّيَاحَ فَتُثِيرُ سَحَابًا فَسُقْنَاهُ إِلَىٰ بَلَدٍ مَيِّتٍ فَأَحْيَيْنَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ كَذَٰلِكَ النُّشُورُ
మరియు అల్లాహ్ యే గాలులను పంపుతాడు. తరువాత అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తరువాత మేము వాటిని మృత ప్రదేశం వైపునకు పంపి, దానితో ఆ నేలను మరణించిన తరువాత తిరిగి బ్రతికిస్తాము. ఇదే విధంగా, (మానవుల) పునరుత్థానం కూడా జరుగుతుంది
مَنْ كَانَ يُرِيدُ الْعِزَّةَ فَلِلَّهِ الْعِزَّةُ جَمِيعًا ۚ إِلَيْهِ يَصْعَدُ الْكَلِمُ الطَّيِّبُ وَالْعَمَلُ الصَّالِحُ يَرْفَعُهُ ۚ وَالَّذِينَ يَمْكُرُونَ السَّيِّئَاتِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۖ وَمَكْرُ أُولَٰئِكَ هُوَ يَبُورُ
గౌరవాన్ని కాంక్షించు వాడు తెలుసు కోవాలి, గౌరవమంతా అల్లాహ్ కే చెందుతుందని! మంచి ప్రవచనాన్నీ ఆయన వైపునకు ఎక్కి పోతాయి. మరియు సత్కర్మ దానిని పైకి ఎత్తుతుంది. మరియు ఎవరైతే చెడు కుట్రలు పన్నుతారో! వారికి కఠిన శిక్ష ఉంటుంది. మరియు అలాంటి వారి కుట్ర, అదే! నశించి పోతుంది

Choose other languages: