Quran Apps in many lanuages:

Surah Fatir Ayahs #38 Translated in Telugu

وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي أَذْهَبَ عَنَّا الْحَزَنَ ۖ إِنَّ رَبَّنَا لَغَفُورٌ شَكُورٌ
మరియు (అప్పుడు) వారు ఇలా అంటారు: మా నుండి దుఃఖాన్ని తొలగించిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. నిశ్చయంగా, మా ప్రభువు క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు
الَّذِي أَحَلَّنَا دَارَ الْمُقَامَةِ مِنْ فَضْلِهِ لَا يَمَسُّنَا فِيهَا نَصَبٌ وَلَا يَمَسُّنَا فِيهَا لُغُوبٌ
ఆయనే తన అనుగ్రహంతో మమ్మల్ని శాశ్వతమైన నివాస స్థలంలో దింపాడు. ఇందులో మాకు ఎలాంటి కష్టమూ లేదు మరియు ఇందులో ఎలాంటి అలసట కూడా లేదు
وَالَّذِينَ كَفَرُوا لَهُمْ نَارُ جَهَنَّمَ لَا يُقْضَىٰ عَلَيْهِمْ فَيَمُوتُوا وَلَا يُخَفَّفُ عَنْهُمْ مِنْ عَذَابِهَا ۚ كَذَٰلِكَ نَجْزِي كُلَّ كَفُورٍ
మరియు సత్యతిరస్కారులైన వారి కొరకు నరకాగ్ని ఉంటుంది. అందులో వారు చనిపోవాలనీ తీర్పూ ఇవ్వబడదు, లేదా వారికి దాని (నరకపు) శిక్ష కూడా తగ్గింప బడదు. ఈ విధంగా, మేము ప్రతి కృతఘ్నునికి (సత్యతిరస్కారునికి) ప్రతీకారం చేస్తాము
وَهُمْ يَصْطَرِخُونَ فِيهَا رَبَّنَا أَخْرِجْنَا نَعْمَلْ صَالِحًا غَيْرَ الَّذِي كُنَّا نَعْمَلُ ۚ أَوَلَمْ نُعَمِّرْكُمْ مَا يَتَذَكَّرُ فِيهِ مَنْ تَذَكَّرَ وَجَاءَكُمُ النَّذِيرُ ۖ فَذُوقُوا فَمَا لِلظَّالِمِينَ مِنْ نَصِيرٍ
మరియు వారు దానిలో (నరకంలో) ఇలా మొరపెట్టుకుంటారు: ఓ మా ప్రభూ! మమ్మల్ని బయటికి తీయి. మేము పూర్వం చేసిన కార్యాలకు భిన్నంగా సత్కార్యాలు చేస్తాము." (వారికిలా సమాధానం ఇవ్వబడుతుంది) : ఏమీ? గుణపాఠం నేర్చుకోదలచిన వాడు గుణపాఠం నేర్చుకోవటానికి, మేము మీకు తగినంత వయస్సును ఇవ్వలేదా? మరియు మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చాడు కదా? కావున మీరు (శిక్షను) రుచి చూడండి. ఇక్కడ దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవ్వడూ ఉండడు
إِنَّ اللَّهَ عَالِمُ غَيْبِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
నిశ్చయంగా, అల్లాహ్ కు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న అగోచర విషయాలన్నీ తెలుసు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలు కూడా బాగా తెలుసు

Choose other languages: