Quran Apps in many lanuages:

Surah Fatir Ayahs #41 Translated in Telugu

وَهُمْ يَصْطَرِخُونَ فِيهَا رَبَّنَا أَخْرِجْنَا نَعْمَلْ صَالِحًا غَيْرَ الَّذِي كُنَّا نَعْمَلُ ۚ أَوَلَمْ نُعَمِّرْكُمْ مَا يَتَذَكَّرُ فِيهِ مَنْ تَذَكَّرَ وَجَاءَكُمُ النَّذِيرُ ۖ فَذُوقُوا فَمَا لِلظَّالِمِينَ مِنْ نَصِيرٍ
మరియు వారు దానిలో (నరకంలో) ఇలా మొరపెట్టుకుంటారు: ఓ మా ప్రభూ! మమ్మల్ని బయటికి తీయి. మేము పూర్వం చేసిన కార్యాలకు భిన్నంగా సత్కార్యాలు చేస్తాము." (వారికిలా సమాధానం ఇవ్వబడుతుంది) : ఏమీ? గుణపాఠం నేర్చుకోదలచిన వాడు గుణపాఠం నేర్చుకోవటానికి, మేము మీకు తగినంత వయస్సును ఇవ్వలేదా? మరియు మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చాడు కదా? కావున మీరు (శిక్షను) రుచి చూడండి. ఇక్కడ దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవ్వడూ ఉండడు
إِنَّ اللَّهَ عَالِمُ غَيْبِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
నిశ్చయంగా, అల్లాహ్ కు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న అగోచర విషయాలన్నీ తెలుసు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలు కూడా బాగా తెలుసు
هُوَ الَّذِي جَعَلَكُمْ خَلَائِفَ فِي الْأَرْضِ ۚ فَمَنْ كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ ۖ وَلَا يَزِيدُ الْكَافِرِينَ كُفْرُهُمْ عِنْدَ رَبِّهِمْ إِلَّا مَقْتًا ۖ وَلَا يَزِيدُ الْكَافِرِينَ كُفْرُهُمْ إِلَّا خَسَارًا
ఆయనే మిమ్మల్ని భూమిపై ఉత్తరాధికారులుగా చేసినవాడు. కావున ఎవడు (సత్యాన్ని) తిరస్కరిస్తాడో అతని తిరస్కారం అతనిపైననే పడుతుంది. సత్యతిరస్కారులకు వారి తిరస్కారం వారి ప్రభువు వద్ద కేవలం వారి యెడల అసహ్యాన్నే అధికం చేస్తుంది. మరియు సత్యతిరస్కారులకు వారి తిరస్కారం వారికి నష్టాన్నే అధికం చేస్తుంది
قُلْ أَرَأَيْتُمْ شُرَكَاءَكُمُ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ أَرُونِي مَاذَا خَلَقُوا مِنَ الْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌ فِي السَّمَاوَاتِ أَمْ آتَيْنَاهُمْ كِتَابًا فَهُمْ عَلَىٰ بَيِّنَتٍ مِنْهُ ۚ بَلْ إِنْ يَعِدُ الظَّالِمُونَ بَعْضُهُمْ بَعْضًا إِلَّا غُرُورًا
వారితో ఇలా అను: అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే ఈ భాగస్వాములను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వారు భూమిలో ఏమి సృష్టించారో నాకు చూపండి? లేదా వారికి ఆకాశాలలో ఏదైనా భాగస్వామ్యం ఉందా? లేదా మేము వారికి ఏదైనా గ్రంథాన్ని ఇచ్చామా? వారు దాని స్పష్టమైన ప్రమాణంపై ఉన్నారని అనటానికి? అది కాదు, అసలు ఈ దుర్మార్గులు పరస్పరం, కేవలం మోసపు మాటలను గురించి వాగ్దానం చేసుకుంటున్నారు
إِنَّ اللَّهَ يُمْسِكُ السَّمَاوَاتِ وَالْأَرْضَ أَنْ تَزُولَا ۚ وَلَئِنْ زَالَتَا إِنْ أَمْسَكَهُمَا مِنْ أَحَدٍ مِنْ بَعْدِهِ ۚ إِنَّهُ كَانَ حَلِيمًا غَفُورًا
నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను తమ స్థానాల నుండి విడి పోకుండా వాటిని నిలిపి ఉంచాడు. ఒకవేళ అవి తొలగిపోతే, ఆయన తప్ప మరెవరైనా వాటిని నిలిపి ఉంచగలరా? నిశ్చయంగా, ఆయన సహనశీలుడు, క్షమాశీలుడు

Choose other languages: