Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #11 Translated in Telugu

إِنْ تَكْفُرُوا فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنْكُمْ ۖ وَلَا يَرْضَىٰ لِعِبَادِهِ الْكُفْرَ ۖ وَإِنْ تَشْكُرُوا يَرْضَهُ لَكُمْ ۗ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ مَرْجِعُكُمْ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, నిశ్చయంగా, అల్లాహ్ మీ అక్కరలేని వాడు. మరియు ఆయన తన దాసులు సత్యతిరస్కార వైఖరిని అవలంబించడాన్ని ఇష్ట పడడు. మరియు మీరు కృతజ్ఞులైనట్లయితే ఆయన మీ పట్ల ఎంతో సంతోషపడతాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరందరికీ, మీ ప్రభువు వైపునకే మరల వలసి ఉంది! అప్పుడు ఆయన, మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాడు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు
وَإِذَا مَسَّ الْإِنْسَانَ ضُرٌّ دَعَا رَبَّهُ مُنِيبًا إِلَيْهِ ثُمَّ إِذَا خَوَّلَهُ نِعْمَةً مِنْهُ نَسِيَ مَا كَانَ يَدْعُو إِلَيْهِ مِنْ قَبْلُ وَجَعَلَ لِلَّهِ أَنْدَادًا لِيُضِلَّ عَنْ سَبِيلِهِ ۚ قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِيلًا ۖ إِنَّكَ مِنْ أَصْحَابِ النَّارِ
మానవునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతడు పశ్చాత్తాపంలో తన ప్రభువు వైపునకు మరలి ఆయనను వేడుకుంటాడు. తరువాత ఆయన (అల్లాహ్) అతనికి తన అనుగ్రహాన్ని ప్రసాదించి నప్పుడు, అతడు పూర్వం దేనిని గురించి వేడుకుంటూ ఉండేవాడో దానిని మరచిపోతాడు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించి, (ఇతరులను) ఆయన మార్గం నుండి తప్పిస్తాడు. (అలాంటి వానితో) ఇలా అను: నీవు, నీ సత్యతిరస్కార వైఖరితో కొంత కాలం సంతోషపడు. నిశ్చయంగా, నీవు నరకవాసుల్లోని వాడవవుతావు
أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ ۗ قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ
ఏమీ? ఎవడైతే శ్రద్ధతో రాత్రి ఘడియలలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ మరియు నిలిచి (నమాజ్) చేస్తూ, పరలోక (జీవిత)మును గురించి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తూ ఉంటాడో! (అలాంటి వాడు, అలా చేయని వాడితో సమానుడా)? వారి నడుగు: ఏమీ? విజ్ఞానులు మరియు అజ్ఞానులు సరిసమానులు కాగలరా? వాస్తవానికి బుద్ధిమంతులే హితబోధ స్వీకరిస్తారు
قُلْ يَا عِبَادِ الَّذِينَ آمَنُوا اتَّقُوا رَبَّكُمْ ۚ لِلَّذِينَ أَحْسَنُوا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۗ وَأَرْضُ اللَّهِ وَاسِعَةٌ ۗ إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُمْ بِغَيْرِ حِسَابٍ
(ఓ ముహమ్మద్!) అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడని) అను: ఓ విశ్వసించిన నా దాసులారా! మీ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరైతే ఈ లోకంలో సత్పురుషులై ఉంటారో (వారికి పరలోకంలో) మేలు జరుగుతుంది. మరియు అల్లాహ్ భూమి చాలా విశాలమైనది. నిశ్చయంగా, సహనం వహించిన వారికి లెక్క లేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది
قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَعْبُدَ اللَّهَ مُخْلِصًا لَهُ الدِّينَ
(ఓ ముహమ్మద్! ఇంకా) ఇలా అను: నిశ్చయంగా, నేను అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ, నా భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆజ్ఞాపించబడ్డాను

Choose other languages: