Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #81 Translated in Telugu

فَأَعْقَبَهُمْ نِفَاقًا فِي قُلُوبِهِمْ إِلَىٰ يَوْمِ يَلْقَوْنَهُ بِمَا أَخْلَفُوا اللَّهَ مَا وَعَدُوهُ وَبِمَا كَانُوا يَكْذِبُونَ
ఆ పిదప వారు అల్లాహ్ తో చేసిన వాగ్దానం పూర్తి చేయనందుకు, అసత్యం పలికినందుకు, ఆయన్ను కలుసుకునే (పునరుత్థాన) దినం వరకు, ఆయన వారి హృదయాలలో కాపట్యం నాటుకునేటట్లు చేశాడు
أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ سِرَّهُمْ وَنَجْوَاهُمْ وَأَنَّ اللَّهَ عَلَّامُ الْغُيُوبِ
ఏమీ? వారి గుప్త రహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు , అల్లాహ్ కు తెలుసని వారికి తెలియదా? మరియు నిశ్చయంగా, అల్లాహ్ అగోచర విషయాలన్నీ తెలిసి వున్నవాడు
الَّذِينَ يَلْمِزُونَ الْمُطَّوِّعِينَ مِنَ الْمُؤْمِنِينَ فِي الصَّدَقَاتِ وَالَّذِينَ لَا يَجِدُونَ إِلَّا جُهْدَهُمْ فَيَسْخَرُونَ مِنْهُمْ ۙ سَخِرَ اللَّهُ مِنْهُمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
మనస్ఫూర్తిగా సంతోషంతో (అల్లాహ్ మార్గంలో) దానం చేసే విశ్వాసులను నిందించే వారినీ మరియు తమ శ్రమ తప్ప మరేమీ ఇవ్వటానికి లేని వారిని ఎగతాళి చేసే వారినీ, అల్లాహ్ ఎగతాళికి గురి చేస్తాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది
اسْتَغْفِرْ لَهُمْ أَوْ لَا تَسْتَغْفِرْ لَهُمْ إِنْ تَسْتَغْفِرْ لَهُمْ سَبْعِينَ مَرَّةً فَلَنْ يَغْفِرَ اللَّهُ لَهُمْ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَفَرُوا بِاللَّهِ وَرَسُولِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
(ఓ ప్రవక్తా!) నీవు వారి (కపట విశ్వాసుల) క్షమాపణ కొరకు వేడుకున్నా, లేదా వారి క్షమాపణ కొరకు వేడుకోక పోయినా ఒక్కటే - ఇంకా నీవు డెబ్బైసార్లు వారి క్షమాపణ కొరకు వేడుకున్నా - అల్లాహ్ వారిని క్షమించడు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు అల్లాహ్ అవిధేయులైన ప్రజలకు సన్మార్గం చూపడు
فَرِحَ الْمُخَلَّفُونَ بِمَقْعَدِهِمْ خِلَافَ رَسُولِ اللَّهِ وَكَرِهُوا أَنْ يُجَاهِدُوا بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ وَقَالُوا لَا تَنْفِرُوا فِي الْحَرِّ ۗ قُلْ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرًّا ۚ لَوْ كَانُوا يَفْقَهُونَ
(తబూక్ దండయాత్రకు పోకుండా) వెనుక ఆగిపోయిన వారు, తాము అల్లాహ్ సందేశహరుని వెంట వెళ్ళటాన్ని నిరోధించి (తమ ఇండ్లలో) కూర్చుండి నందుకు సంతోషపడ్డారు. మరియు వారు తమ ధనసంపత్తులతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడటాన్ని అసహ్యించుకున్నారు. మరియు వారు ఇతరులతో: ఈ తీవ్రమైన వేడిలో వెళ్ళకండి!" అని అన్నారు. వారితో అను: భగభగ మండే నరకాగ్ని దీని కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది." అది వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది

Choose other languages: