Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #83 Translated in Telugu

الَّذِينَ يَلْمِزُونَ الْمُطَّوِّعِينَ مِنَ الْمُؤْمِنِينَ فِي الصَّدَقَاتِ وَالَّذِينَ لَا يَجِدُونَ إِلَّا جُهْدَهُمْ فَيَسْخَرُونَ مِنْهُمْ ۙ سَخِرَ اللَّهُ مِنْهُمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
మనస్ఫూర్తిగా సంతోషంతో (అల్లాహ్ మార్గంలో) దానం చేసే విశ్వాసులను నిందించే వారినీ మరియు తమ శ్రమ తప్ప మరేమీ ఇవ్వటానికి లేని వారిని ఎగతాళి చేసే వారినీ, అల్లాహ్ ఎగతాళికి గురి చేస్తాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది
اسْتَغْفِرْ لَهُمْ أَوْ لَا تَسْتَغْفِرْ لَهُمْ إِنْ تَسْتَغْفِرْ لَهُمْ سَبْعِينَ مَرَّةً فَلَنْ يَغْفِرَ اللَّهُ لَهُمْ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَفَرُوا بِاللَّهِ وَرَسُولِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
(ఓ ప్రవక్తా!) నీవు వారి (కపట విశ్వాసుల) క్షమాపణ కొరకు వేడుకున్నా, లేదా వారి క్షమాపణ కొరకు వేడుకోక పోయినా ఒక్కటే - ఇంకా నీవు డెబ్బైసార్లు వారి క్షమాపణ కొరకు వేడుకున్నా - అల్లాహ్ వారిని క్షమించడు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు అల్లాహ్ అవిధేయులైన ప్రజలకు సన్మార్గం చూపడు
فَرِحَ الْمُخَلَّفُونَ بِمَقْعَدِهِمْ خِلَافَ رَسُولِ اللَّهِ وَكَرِهُوا أَنْ يُجَاهِدُوا بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ وَقَالُوا لَا تَنْفِرُوا فِي الْحَرِّ ۗ قُلْ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرًّا ۚ لَوْ كَانُوا يَفْقَهُونَ
(తబూక్ దండయాత్రకు పోకుండా) వెనుక ఆగిపోయిన వారు, తాము అల్లాహ్ సందేశహరుని వెంట వెళ్ళటాన్ని నిరోధించి (తమ ఇండ్లలో) కూర్చుండి నందుకు సంతోషపడ్డారు. మరియు వారు తమ ధనసంపత్తులతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడటాన్ని అసహ్యించుకున్నారు. మరియు వారు ఇతరులతో: ఈ తీవ్రమైన వేడిలో వెళ్ళకండి!" అని అన్నారు. వారితో అను: భగభగ మండే నరకాగ్ని దీని కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది." అది వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది
فَلْيَضْحَكُوا قَلِيلًا وَلْيَبْكُوا كَثِيرًا جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ
కావున ఇప్పుడు వారిని కొంత నవ్వనివ్వు మరియు వారి కర్మలకు ప్రతిఫలంగా (మున్ముందు) వారికి ఎంతో ఏడ్వవలసి ఉంది
فَإِنْ رَجَعَكَ اللَّهُ إِلَىٰ طَائِفَةٍ مِنْهُمْ فَاسْتَأْذَنُوكَ لِلْخُرُوجِ فَقُلْ لَنْ تَخْرُجُوا مَعِيَ أَبَدًا وَلَنْ تُقَاتِلُوا مَعِيَ عَدُوًّا ۖ إِنَّكُمْ رَضِيتُمْ بِالْقُعُودِ أَوَّلَ مَرَّةٍ فَاقْعُدُوا مَعَ الْخَالِفِينَ
కావున (ఓ ప్రవక్తా!) ఒకవేళ అల్లాహ్ నిన్ను తిరిగి వారిలో (కపట విశ్వాసులలో) ఒక వర్గం వారి వద్దకు తీసుకొని పోతే! మరియు వారు నిన్ను (మరొక దండయాత్రకు) పోవటానికి అనుమతి అడిగితే! వారితో అను! మీరు నాతో ఏ మాత్రం బయలుదేర వద్దు! మరియు నా పక్షమున శత్రువులతో పోరాడనూ వద్దు! వాస్తవానికి మీరు మొదట కూర్చొని ఉండటానికి ఇష్టపడ్డారు, కాబట్టి మీరు వెనుక ఉండి పోయిన వారితో (ఇండ్లలోనే) కూర్చొని ఉండండి

Choose other languages: