Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #51 Translated in Telugu

لَوْ خَرَجُوا فِيكُمْ مَا زَادُوكُمْ إِلَّا خَبَالًا وَلَأَوْضَعُوا خِلَالَكُمْ يَبْغُونَكُمُ الْفِتْنَةَ وَفِيكُمْ سَمَّاعُونَ لَهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
ఒకవేళ వారు మీతో కలిసి వెళ్ళినా మీలో కలతలు తప్ప మరేమీ అధికం చేసేవారు కాదు. మరియు మీ మధ్య ఉపద్రవం (ఫిత్న) రేకెత్తించటానికి తీవ్రప్రయత్నాలు చేసేవారు. మరియు మీలో కొందరు వారి కొరకు (కపట విశ్వాసుల కొరకు) మాటలు వినేవారు (వారి గూఢాచారులు) ఉన్నారు. మరియు అల్లాహ్ కు దుర్మార్గుల గురించి బాగా తెలుసు
لَقَدِ ابْتَغَوُا الْفِتْنَةَ مِنْ قَبْلُ وَقَلَّبُوا لَكَ الْأُمُورَ حَتَّىٰ جَاءَ الْحَقُّ وَظَهَرَ أَمْرُ اللَّهِ وَهُمْ كَارِهُونَ
(ఓ ప్రవక్తా!) వాస్తవానికి, వారు ఇంతకు ముందు కూడా కల్లోలాన్ని (ఫిత్నను) పుట్టించి, నీ కార్యాలను తలక్రిందులు చేయగోరారు. చివరకు సత్యం బహిర్గతమయింది మరియు అల్లాహ్ నిర్ణయం స్పష్టమయ్యింది. మరియు వారు దీన్ని అసహ్యించుకున్నారు
وَمِنْهُمْ مَنْ يَقُولُ ائْذَنْ لِي وَلَا تَفْتِنِّي ۚ أَلَا فِي الْفِتْنَةِ سَقَطُوا ۗ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌ بِالْكَافِرِينَ
మరియు వారిలో: నాకు (వెనుక ఉండటానికి) అనుమతినివ్వు! నన్ను ఏ మాత్రం పరీక్షకు గురిచేయకు!" అని అనేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి, వారు (ఇలా అనుమతి కోరి) పరీక్షకు గురి అయ్యారు! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులను నరకాగ్ని చుట్టుకోనున్నది
إِنْ تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ ۖ وَإِنْ تُصِبْكَ مُصِيبَةٌ يَقُولُوا قَدْ أَخَذْنَا أَمْرَنَا مِنْ قَبْلُ وَيَتَوَلَّوْا وَهُمْ فَرِحُونَ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ నీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. మరియు నీపై ఆపద వస్తే వారు: మేము ముందుగానే జాగ్రత్త పడ్డాము!" అని అంటూ సంతోషపడుతూ మరలిపోతారు
قُلْ لَنْ يُصِيبَنَا إِلَّا مَا كَتَبَ اللَّهُ لَنَا هُوَ مَوْلَانَا ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
వారితో ఇలా అను: అల్లాహ్ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు. ఆయనే మా సంరక్షకుడు. మరియు విశ్వాసులు అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి

Choose other languages: