Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #52 Translated in Telugu

لَقَدِ ابْتَغَوُا الْفِتْنَةَ مِنْ قَبْلُ وَقَلَّبُوا لَكَ الْأُمُورَ حَتَّىٰ جَاءَ الْحَقُّ وَظَهَرَ أَمْرُ اللَّهِ وَهُمْ كَارِهُونَ
(ఓ ప్రవక్తా!) వాస్తవానికి, వారు ఇంతకు ముందు కూడా కల్లోలాన్ని (ఫిత్నను) పుట్టించి, నీ కార్యాలను తలక్రిందులు చేయగోరారు. చివరకు సత్యం బహిర్గతమయింది మరియు అల్లాహ్ నిర్ణయం స్పష్టమయ్యింది. మరియు వారు దీన్ని అసహ్యించుకున్నారు
وَمِنْهُمْ مَنْ يَقُولُ ائْذَنْ لِي وَلَا تَفْتِنِّي ۚ أَلَا فِي الْفِتْنَةِ سَقَطُوا ۗ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌ بِالْكَافِرِينَ
మరియు వారిలో: నాకు (వెనుక ఉండటానికి) అనుమతినివ్వు! నన్ను ఏ మాత్రం పరీక్షకు గురిచేయకు!" అని అనేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి, వారు (ఇలా అనుమతి కోరి) పరీక్షకు గురి అయ్యారు! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులను నరకాగ్ని చుట్టుకోనున్నది
إِنْ تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ ۖ وَإِنْ تُصِبْكَ مُصِيبَةٌ يَقُولُوا قَدْ أَخَذْنَا أَمْرَنَا مِنْ قَبْلُ وَيَتَوَلَّوْا وَهُمْ فَرِحُونَ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ నీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. మరియు నీపై ఆపద వస్తే వారు: మేము ముందుగానే జాగ్రత్త పడ్డాము!" అని అంటూ సంతోషపడుతూ మరలిపోతారు
قُلْ لَنْ يُصِيبَنَا إِلَّا مَا كَتَبَ اللَّهُ لَنَا هُوَ مَوْلَانَا ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
వారితో ఇలా అను: అల్లాహ్ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు. ఆయనే మా సంరక్షకుడు. మరియు విశ్వాసులు అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి
قُلْ هَلْ تَرَبَّصُونَ بِنَا إِلَّا إِحْدَى الْحُسْنَيَيْنِ ۖ وَنَحْنُ نَتَرَبَّصُ بِكُمْ أَنْ يُصِيبَكُمُ اللَّهُ بِعَذَابٍ مِنْ عِنْدِهِ أَوْ بِأَيْدِينَا ۖ فَتَرَبَّصُوا إِنَّا مَعَكُمْ مُتَرَبِّصُونَ
ఇలా అను: మీరు మా విషయంలో నిరీక్షిస్తున్నది రెండు మేలైన వాటిలో ఒకటి. అల్లాహ్ స్వయంగా మీకు శిక్ష విధిస్తాడా, లేదా మా చేతుల ద్వారానా? అని మేము నిరీక్షిస్తున్నాము. కావున మీరూ నిరీక్షించండి, నిశ్చయంగా మేము కూడా మీతో పాటు నిరీక్షిస్తున్నాము

Choose other languages: