Quran Apps in many lanuages:

Surah At-Tahrim Ayahs #5 Translated in Telugu

يَا أَيُّهَا النَّبِيُّ لِمَ تُحَرِّمُ مَا أَحَلَّ اللَّهُ لَكَ ۖ تَبْتَغِي مَرْضَاتَ أَزْوَاجِكَ ۚ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ
ఓ ప్రవక్తా! అల్లాహ్ నీకు ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించుకుంటున్నావు? నీవు నీ భార్యల ప్రసన్నతను కోరుతున్నావా? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
قَدْ فَرَضَ اللَّهُ لَكُمْ تَحِلَّةَ أَيْمَانِكُمْ ۚ وَاللَّهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ الْعَلِيمُ الْحَكِيمُ
వాస్తవానికి అల్లాహ్ మీ ప్రమాణాల పరిహార పద్ధతి మీకు నిర్దేశించాడు. మరియు అల్లాహ్ యే మీ యజమాని. మరియు ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَىٰ بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا فَلَمَّا نَبَّأَتْ بِهِ وَأَظْهَرَهُ اللَّهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهُ وَأَعْرَضَ عَنْ بَعْضٍ ۖ فَلَمَّا نَبَّأَهَا بِهِ قَالَتْ مَنْ أَنْبَأَكَ هَٰذَا ۖ قَالَ نَبَّأَنِيَ الْعَلِيمُ الْخَبِيرُ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ప్రవక్త తన భార్యలలో ఒకామెకు రహస్యంగా ఒక విషయం చెప్పగా ఆమె దానిని (ఆ రహస్యాన్ని) మరొకామెకు చెప్పింది. మరియు అల్లాహ్ అతనికి (ప్రవక్తకు) ఆ విషయాన్ని తెలియజేశాడు. (వాస్తవానికి) అతను (ప్రవక్త) ఆ విషయాన్ని (మొదటి) ఆమెకు కొంత తెలిపి, మరికొంత తెలుపలేదు. ఇక అతను (ప్రవక్త, మొదటి) ఆమెకు దానిని (రహస్యం బయట పడిన సంగతిని) తెలిపినప్పుడు, ఆమె (ఆశ్చర్యపోతూ) అతనితో ఇలా అడిగింది: ఇది నీకు ఎవరు తెలిపారు?" అతను జవాబిచ్చాడు: నాకు ఈ విషయం ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వం తెలిసినవాడు తెలిపాడు
إِنْ تَتُوبَا إِلَى اللَّهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُمَا ۖ وَإِنْ تَظَاهَرَا عَلَيْهِ فَإِنَّ اللَّهَ هُوَ مَوْلَاهُ وَجِبْرِيلُ وَصَالِحُ الْمُؤْمِنِينَ ۖ وَالْمَلَائِكَةُ بَعْدَ ذَٰلِكَ ظَهِيرٌ
(ఆ ఇద్దరు స్త్రీలతో ఇలా అనబడింది): ఒకవేళ మీరిద్దరూ అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలితే (అది మీ మేలుకే) వాస్తవానికి మీ ఇద్దరి హృదయాలు (ఋజుమార్గం నుండి) తొలగిపోయాయి. ఒకవేళ మీరిద్దరు ప్రవక్తకు విరోధంగా పోతే! నిశ్చయంగా, అల్లాహ్ అతని సంరక్షకుడు మరియు జిబ్రీల్ మరియు సత్పురుషులైన విశ్వాసులు అతని (సహాయకులు). మరియు దేవదూతలందరు కూడా అతని సహాయకులని (తెలుసుకోండి)
عَسَىٰ رَبُّهُ إِنْ طَلَّقَكُنَّ أَنْ يُبْدِلَهُ أَزْوَاجًا خَيْرًا مِنْكُنَّ مُسْلِمَاتٍ مُؤْمِنَاتٍ قَانِتَاتٍ تَائِبَاتٍ عَابِدَاتٍ سَائِحَاتٍ ثَيِّبَاتٍ وَأَبْكَارًا
ఒకవేళ అతను (ముహమ్మద్!) మీ అందరికీ విడాకులిస్తే! అల్లాహ్, మీకు బదులుగా, మీకంటే మంచి భార్యలను, అతనికి (ప్రవక్తకు) ప్రసాదించగలడు! వారు మంచి ముస్లింలు, విశ్వాసులు, భక్తిపరులు, పశ్చాత్తాప పడేవారు, (అల్లాహ్ ను) ఆరాధించేవారు, వలస పోయే (ఉపవాసాలు చేసే) వారు అయిన, విధవలు లేదా కన్యలు అయి ఉంటారు

Choose other languages: