Quran Apps in many lanuages:

Surah At-Tahrim Ayahs #8 Translated in Telugu

إِنْ تَتُوبَا إِلَى اللَّهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُمَا ۖ وَإِنْ تَظَاهَرَا عَلَيْهِ فَإِنَّ اللَّهَ هُوَ مَوْلَاهُ وَجِبْرِيلُ وَصَالِحُ الْمُؤْمِنِينَ ۖ وَالْمَلَائِكَةُ بَعْدَ ذَٰلِكَ ظَهِيرٌ
(ఆ ఇద్దరు స్త్రీలతో ఇలా అనబడింది): ఒకవేళ మీరిద్దరూ అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలితే (అది మీ మేలుకే) వాస్తవానికి మీ ఇద్దరి హృదయాలు (ఋజుమార్గం నుండి) తొలగిపోయాయి. ఒకవేళ మీరిద్దరు ప్రవక్తకు విరోధంగా పోతే! నిశ్చయంగా, అల్లాహ్ అతని సంరక్షకుడు మరియు జిబ్రీల్ మరియు సత్పురుషులైన విశ్వాసులు అతని (సహాయకులు). మరియు దేవదూతలందరు కూడా అతని సహాయకులని (తెలుసుకోండి)
عَسَىٰ رَبُّهُ إِنْ طَلَّقَكُنَّ أَنْ يُبْدِلَهُ أَزْوَاجًا خَيْرًا مِنْكُنَّ مُسْلِمَاتٍ مُؤْمِنَاتٍ قَانِتَاتٍ تَائِبَاتٍ عَابِدَاتٍ سَائِحَاتٍ ثَيِّبَاتٍ وَأَبْكَارًا
ఒకవేళ అతను (ముహమ్మద్!) మీ అందరికీ విడాకులిస్తే! అల్లాహ్, మీకు బదులుగా, మీకంటే మంచి భార్యలను, అతనికి (ప్రవక్తకు) ప్రసాదించగలడు! వారు మంచి ముస్లింలు, విశ్వాసులు, భక్తిపరులు, పశ్చాత్తాప పడేవారు, (అల్లాహ్ ను) ఆరాధించేవారు, వలస పోయే (ఉపవాసాలు చేసే) వారు అయిన, విధవలు లేదా కన్యలు అయి ఉంటారు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنْفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ
ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబం వారిని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి! దానిపై ఎంతో బలిష్ఠులూ, కఠినులూ అయిన దేవదూతలు నియమింపబడి ఉంటారు. వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు
يَا أَيُّهَا الَّذِينَ كَفَرُوا لَا تَعْتَذِرُوا الْيَوْمَ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُونَ
ఓ సత్యతిరస్కారులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. నిశ్చయంగా, మీరు చేస్తూ ఉండిన కర్మలకు, తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతోంది
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا تُوبُوا إِلَى اللَّهِ تَوْبَةً نَصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَنْ يُكَفِّرَ عَنْكُمْ سَيِّئَاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ يَوْمَ لَا يُخْزِي اللَّهُ النَّبِيَّ وَالَّذِينَ آمَنُوا مَعَهُ ۖ نُورُهُمْ يَسْعَىٰ بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِمْ يَقُولُونَ رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ వైపునకు మనః పూర్వకమైన పశ్చాత్తాపంతో, క్షమాపణ కొరకు మరలితే! మీ ప్రభువు మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు; ఆ రోజు అల్లాహ్ తన ప్రవక్తను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని అవమానం పాలు చేయడు. వారి కాంతి, వారి ముందు మరియు వారి కుడి వైపు నుండి ప్రసరిస్తూ ఉంటుంది. వారి ఇలా ప్రార్థిస్తారు: ఓ మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం చేయి మరియు మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా, నీవే ప్రతిదీ చేయగల సమర్ధుడవు

Choose other languages: