Quran Apps in many lanuages:

Surah Ar-Rum Ayahs #58 Translated in Telugu

اللَّهُ الَّذِي خَلَقَكُمْ مِنْ ضَعْفٍ ثُمَّ جَعَلَ مِنْ بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِنْ بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۖ وَهُوَ الْعَلِيمُ الْقَدِيرُ
అల్లాహ్ యే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించిన వాడు. మళ్ళీ ఆ బలహీన స్థితి తరువాత మీకు బలాన్ని ఇచ్చాడు. ఆ బలం తరువాత మళ్ళీ మిమ్మల్ని బలహీనులుగా, ముసలివారిగా చేశాడు. ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. మరియు కేవలం ఆయనే సర్వజ్ఞుడు, సర్వసమర్ధుడు
وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُقْسِمُ الْمُجْرِمُونَ مَا لَبِثُوا غَيْرَ سَاعَةٍ ۚ كَذَٰلِكَ كَانُوا يُؤْفَكُونَ
మరియు ఆ ఘడియ సంభవించిన రోజు, అపరాధులు, ప్రమాణం చేస్తూ: మేము ఒక ఘడియ సేపు కంటే ఎక్కువ కాలం (ప్రపంచంలో) ఉండలేదు" అని అంటారు. ఇదే విధంగా వారు (ప్రాపంచిక జీవితంలో) భ్రమలో ఉండేవారు
وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَالْإِيمَانَ لَقَدْ لَبِثْتُمْ فِي كِتَابِ اللَّهِ إِلَىٰ يَوْمِ الْبَعْثِ ۖ فَهَٰذَا يَوْمُ الْبَعْثِ وَلَٰكِنَّكُمْ كُنْتُمْ لَا تَعْلَمُونَ
మరియు జ్ఞానం మరియు విశ్వాసం అనుగ్రహింప బడినవారు ఇలా అంటారు: వాస్తవానికి అల్లాహ్ మూలగ్రంథం ప్రకారం మీరు పునరుత్థాన దినం వరకు (ఇహలోకంలో) ఉంటిరి. ఇక ఇదే ఆ పునరుత్థాన దినం, కాని నిశ్చయంగా! మీరిది తెలుసు కోలేక పోయారు
فَيَوْمَئِذٍ لَا يَنْفَعُ الَّذِينَ ظَلَمُوا مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
కనుక ఆ రోజు దుర్మార్గులకు, వారి సాకులు ఏ మాత్రం ప్రయోజనకరం కావు మరియు వారికి తమను తాము సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వబడదు
وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ ۚ وَلَئِنْ جِئْتَهُمْ بِآيَةٍ لَيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ أَنْتُمْ إِلَّا مُبْطِلُونَ
మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు, ప్రతి ఒక్క విషయపు ఉపమానాన్ని బోధించాము. అయినా నీవు వారి వద్దకు ఏ అద్భుత సూచన (ఆయత్) తెచ్చినా, వారిలో సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు: మీరు కేవలం బూటకాలే పలుకుతున్నారు

Choose other languages: