Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #134 Translated in Telugu

وَإِنْ يَتَفَرَّقَا يُغْنِ اللَّهُ كُلًّا مِنْ سَعَتِهِ ۚ وَكَانَ اللَّهُ وَاسِعًا حَكِيمًا
కాని ఒకవేళ వారు (దంపతులు) విడిపోతే! అల్లాహ్ తన దాతృత్వంతో వారిలో ప్రతి ఒక్కరినీ, స్వయం సమృద్ధులుగా చేయవచ్చు! మరియు అల్లాహ్! సర్వవ్యాప్తి (సర్వోపగతుడు), మహా వివేచనాపరుడు
وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَلَقَدْ وَصَّيْنَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ اتَّقُوا اللَّهَ ۚ وَإِنْ تَكْفُرُوا فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ غَنِيًّا حَمِيدًا
మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు చెందినదే. మరియు వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము. మరియు ఒకవేళ మీరు తిరస్కరిస్తే భూమ్యాకాశాలలో ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ కే చెందినది. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు
وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు
إِنْ يَشَأْ يُذْهِبْكُمْ أَيُّهَا النَّاسُ وَيَأْتِ بِآخَرِينَ ۚ وَكَانَ اللَّهُ عَلَىٰ ذَٰلِكَ قَدِيرًا
ఓ మానవులారా! ఆయన కోరితే, మిమ్మల్ని అంతం చేసి ఇతరులను తేగలడు. మరియు వాస్తవానికి, అల్లాహ్ ఇలా చేయగల సమర్ధుడు
مَنْ كَانَ يُرِيدُ ثَوَابَ الدُّنْيَا فَعِنْدَ اللَّهِ ثَوَابُ الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَكَانَ اللَّهُ سَمِيعًا بَصِيرًا
ఎవడు ఇహలోక ఫలితాన్ని కోరుతాడో, (వానికదే దొరుకుతుంది). కాని (కేవలం) అల్లాహ్ వద్దనే ఇహలోక మరియు పరలోక ఫలితాలున్నాయి. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు

Choose other languages: