Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #124 Translated in Telugu

يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا
అతడు (షైతాన్) వారికి వాగ్దానం చేస్తాడు మరియు వారిలో విపరీత కోరికలను రేపుతాడు. కాని, షైతాన్ వారికి చేసే వాగ్దానాలు మోసపుచ్చేవి మాత్రమే
أُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا
అలాంటి వారి ఆశ్రయం నరకమే; మరియు వారికి దాని నుండి తప్పించుకునే మార్గమే ఉండదు
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ وَعْدَ اللَّهِ حَقًّا ۚ وَمَنْ أَصْدَقُ مِنَ اللَّهِ قِيلًا
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! మేము వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాము; అందులో వారు శాశ్వతంగా కలకాల ముంటారు. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. మరియు పలుకులలో అల్లాహ్ కంటే ఎక్కువ సత్యవంతుడెవడు
لَيْسَ بِأَمَانِيِّكُمْ وَلَا أَمَانِيِّ أَهْلِ الْكِتَابِ ۗ مَنْ يَعْمَلْ سُوءًا يُجْزَ بِهِ وَلَا يَجِدْ لَهُ مِنْ دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
మీ కోరికల ప్రకారంగా గానీ, లేదా గ్రంథ ప్రజల కోరికల ప్రకారంగా గానీ (మోక్షం) లేదు! పాపం చేసిన వానికి దానికి తగిన శిక్ష ఇవ్వబడుతుంది; మరియు వాడు, అల్లాహ్ తప్ప మరొక రక్షకుడిని గానీ, సహాయకుడిని గానీ పొందలేడు
وَمَنْ يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ مِنْ ذَكَرٍ أَوْ أُنْثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلَا يُظْلَمُونَ نَقِيرًا
మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూర బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు

Choose other languages: