Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #35 Translated in Telugu

جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۖ لَهُمْ فِيهَا مَا يَشَاءُونَ ۚ كَذَٰلِكَ يَجْزِي اللَّهُ الْمُتَّقِينَ
వారు ప్రవేశించే శాశ్వత స్వర్గవనాలలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి వారు కోరేది దొరుకుతుంది. దైవభీతి గలవారికి అల్లాహ్ ఈ విధంగా ప్రతిఫలమిస్తాడు
الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَامٌ عَلَيْكُمُ ادْخُلُوا الْجَنَّةَ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో: మీకు శాంతి కలుగు గాక (సలాం) ! మీరు చేసిన మంచిపనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి!" అని అంటారు
هَلْ يَنْظُرُونَ إِلَّا أَنْ تَأْتِيَهُمُ الْمَلَائِكَةُ أَوْ يَأْتِيَ أَمْرُ رَبِّكَ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّهُ وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ
ఏమీ? వారు (సత్యతిరస్కారులు) తమ వద్దకు దేవదూతల రాక కోసం ఎదురు చూస్తున్నారా? లేక నీ ప్రభువు ఆజ్ఞ (తీర్పు) కోసం ఎదురు చూస్తున్నారా? వారికి పూర్వం ఉన్నవారు కూడా ఈ విధంగానే ప్రవర్తించారు. మరియు అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు
فَأَصَابَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
అప్పుడు వారి దుష్కర్మల ఫలితాలు వారిపై పడ్డాయి మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంది
وَقَالَ الَّذِينَ أَشْرَكُوا لَوْ شَاءَ اللَّهُ مَا عَبَدْنَا مِنْ دُونِهِ مِنْ شَيْءٍ نَحْنُ وَلَا آبَاؤُنَا وَلَا حَرَّمْنَا مِنْ دُونِهِ مِنْ شَيْءٍ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ فَهَلْ عَلَى الرُّسُلِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
మరియు (అల్లాహ్ కు) సాటి కల్పించే వారు అంటారు: ఒకవేళ అల్లాహ్ కోరి ఉంటే! మేము గానీ మా తండ్రితాతలు గానీ, ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించేవారం కాదు. మరియు ఆయన ఆజ్ఞ లేనిదే మేము దేన్ని కూడా నిషేధించేవారం కాదు." వారికి పూర్వం వారు కూడా ఇలాగే చేశారు. అయితే ప్రవక్తల బాధ్యత (అల్లాహ్) సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప ఇంకేమిటి

Choose other languages: