Quran Apps in many lanuages:

Surah Al-Mumenoon Ayahs #114 Translated in Telugu

فَاتَّخَذْتُمُوهُمْ سِخْرِيًّا حَتَّىٰ أَنْسَوْكُمْ ذِكْرِي وَكُنْتُمْ مِنْهُمْ تَضْحَكُونَ
కాని మీరు వారిని పరిహాసానికి గురి చేసేవారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం నుండి మరపింపజేసింది; మరియు మీరు వారి మీద నవ్వేవారు (ఎగతాళి చేసేవారు)
إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا صَبَرُوا أَنَّهُمْ هُمُ الْفَائِزُونَ
నిశ్చయంగా, ఈ రోజు నేను వారికి, వారి సహనానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాను. నిశ్చయంగా వారే విజయం పొందినవారు
قَالَ كَمْ لَبِثْتُمْ فِي الْأَرْضِ عَدَدَ سِنِينَ
(అల్లాహ్) ఇలా ప్రశ్నిస్తాడు: మీరు భూమిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు
قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ فَاسْأَلِ الْعَادِّينَ
వారిలా జవాబిస్తారు: మేమక్కడ ఒక్క దినమో లేక దినపు కొంత భాగమో ఉంటిమి. లెక్క పెట్టిన వారిని అడుగు
قَالَ إِنْ لَبِثْتُمْ إِلَّا قَلِيلًا ۖ لَوْ أَنَّكُمْ كُنْتُمْ تَعْلَمُونَ
(అల్లాహ్) అంటాడు: మీరక్కడ ఉన్నది కొంతకాలం మాత్రమే! ఒకవేళ ఇది మీరు తెలుసుకొని ఉంటే (ఎంత బాగుండేది)

Choose other languages: