Quran Apps in many lanuages:

Surah Al-Mujadala Ayahs #20 Translated in Telugu

اتَّخَذُوا أَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوا عَنْ سَبِيلِ اللَّهِ فَلَهُمْ عَذَابٌ مُهِينٌ
వారు తమ ప్రమాణాలను డాలుగా చేసుకొని (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తున్నారు, కావున వారికి అవమాన కరమైన శిక్ష పడుతుంది
لَنْ تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُمْ مِنَ اللَّهِ شَيْئًا ۚ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
అల్లాహ్ (శిక్ష) నుండి కాపాడటానికి, వారి సంపదలు గానీ, వారి సంతానం గానీ వారికి ఏ మాత్రం పనికిరావు. ఇలాంటి వారే నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
يَوْمَ يَبْعَثُهُمُ اللَّهُ جَمِيعًا فَيَحْلِفُونَ لَهُ كَمَا يَحْلِفُونَ لَكُمْ ۖ وَيَحْسَبُونَ أَنَّهُمْ عَلَىٰ شَيْءٍ ۚ أَلَا إِنَّهُمْ هُمُ الْكَاذِبُونَ
అల్లాహ్ వారందరినీ మరల బ్రతికించి లేపిన రోజు, వారు మీతో ప్రమాణాలు చేసినట్లు ఆయన (అల్లాహ్) ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. మరియు దాని వలన వారు మంచి స్థితిలో ఉన్నారని భావిస్తారు. జాగ్రత్త! నిశ్చయంగా, ఇలాంటి వారే అసత్యవాదులు
اسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطَانُ فَأَنْسَاهُمْ ذِكْرَ اللَّهِ ۚ أُولَٰئِكَ حِزْبُ الشَّيْطَانِ ۚ أَلَا إِنَّ حِزْبَ الشَّيْطَانِ هُمُ الْخَاسِرُونَ
షైతాన్ వారిపై ప్రాబల్యం పొంది నందు వలన వారిని అల్లాహ్ ధ్యానం నుండి మరపింప జేశాడు. అలాంటి వారు షైతాన్ పక్షానికి చెందిన వారు. జాగ్రత్త! షైతాన్ పక్షానికి చెందినవారు, వారే! నిశ్చయంగా నష్టపోయేవారు
إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّهَ وَرَسُولَهُ أُولَٰئِكَ فِي الْأَذَلِّينَ
నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తారో! అలాంటి వారే, పరమ నీచులలో చేరిన వారు

Choose other languages: