Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #11 Translated in Telugu

5:7
وَاذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ وَمِيثَاقَهُ الَّذِي وَاثَقَكُمْ بِهِ إِذْ قُلْتُمْ سَمِعْنَا وَأَطَعْنَا ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మరియు మీకు అల్లాహ్ చేసిన అనుగ్రహాన్ని మరియు ఆయన మీ నుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు: మేము విన్నాము మరియు విధేయుల మయ్యాము." అని అన్నారు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, హృదయాలలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
5:8
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ لِلَّهِ شُهَدَاءَ بِالْقِسْطِ ۖ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ عَلَىٰ أَلَّا تَعْدِلُوا ۚ اعْدِلُوا هُوَ أَقْرَبُ لِلتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును
5:9
وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۙ لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ
మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయని అల్లాహ్ వాగ్దానం చేశాడు
وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
మరియు ఎవరైతే సత్యతిరస్కారానికి పాల్పడి, మా సూచనలను అబద్ధాలని తిరస్కరిస్తారో! అలాంటి వారు భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ هَمَّ قَوْمٌ أَنْ يَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ فَكَفَّ أَيْدِيَهُمْ عَنْكُمْ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
ఓ విశ్వాసులారా! ఒక జాతి వారు (మీకు హాని చేయ సంకల్పించి) తమ చేతులను మీ వైపునకు చాచినపుడు, అల్లాహ్ వారి చేతులను మీ నుండి తొలగించి మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు విశ్వాసులు అల్లాహ్ పైననే నమ్మక ముంచుకుంటారు

Choose other languages: