Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #60 Translated in Telugu

وَمَنْ يَتَوَلَّ اللَّهَ وَرَسُولَهُ وَالَّذِينَ آمَنُوا فَإِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْغَالِبُونَ
మరియు ఎవరు అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారి వైపునకు మరలుతారో! నిశ్చయంగా, వారే అల్లాహ్ పక్షానికి చెందినవారు, వారే విజయం సాధించేవారు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الَّذِينَ اتَّخَذُوا دِينَكُمْ هُزُوًا وَلَعِبًا مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ وَالْكُفَّارَ أَوْلِيَاءَ ۚ وَاتَّقُوا اللَّهَ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
ఓ విశ్వాసులారా! మీ ధర్మాన్ని ఎగతాళిగా నవ్వులాటగా పరిగణించేవారు పూర్వగ్రంథ ప్రజలైనా, లేదా సత్యతిరస్కారులైనా, వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మరియు మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి
وَإِذَا نَادَيْتُمْ إِلَى الصَّلَاةِ اتَّخَذُوهَا هُزُوًا وَلَعِبًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَا يَعْقِلُونَ
మరియు మీరు నమాజ్ కొరకు పిలుపు (అజాన్) ఇస్తే, వారు దానిని ఎగతాళిగా, నవ్వులాటగా తీసుకుంటారు. అది ఎందుకంటే వాస్తవానికి వారు బుద్ధిహీనులైన జనులు
قُلْ يَا أَهْلَ الْكِتَابِ هَلْ تَنْقِمُونَ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنْزِلَ إِلَيْنَا وَمَا أُنْزِلَ مِنْ قَبْلُ وَأَنَّ أَكْثَرَكُمْ فَاسِقُونَ
వారితో ఇలా అను: ఓ గ్రంథ ప్రజలారా! ఏమీ? మేము అల్లాహ్ ను మరియు ఆయన మాపై అవతరింపజేసిన మరియు మాకు పూర్వం అవతరింపజేసిన (గ్రంథాలను) విశ్వసించామనే, మీరు మమ్మల్ని పీడిస్తున్నారా? మరియు నిశ్చయంగా, మీలో చాలా మంది అవిధేయులు (దుష్టులు) ఉన్నారు
قُلْ هَلْ أُنَبِّئُكُمْ بِشَرٍّ مِنْ ذَٰلِكَ مَثُوبَةً عِنْدَ اللَّهِ ۚ مَنْ لَعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوتَ ۚ أُولَٰئِكَ شَرٌّ مَكَانًا وَأَضَلُّ عَنْ سَوَاءِ السَّبِيلِ
ఇలా అను: ఏమీ? అల్లాహ్ తరఫు నుండి ఎవరికి, దీని కంటే హీనకరమైన ప్రతిఫలం దొరుకుతుందో మీకు తెలుపనా? వారే, ఎవరినైతే అల్లాహ్ శపించాడో (బహిష్కరించాడో) మరియు ఎవరినైతే ఆయన ఆగ్రహానికి గురి అయ్యారో! మరియు వారిలో కొందరు, ఎవరినైతే ఆయన కోతులుగా మరియు పందులుగా మార్చాడో! మరియు వారు ఎవరైతే కల్పిత దైవాల (తాగూత్ ల) దాస్యం చేస్తారో. అలాంటి వారు (పునరుత్థాన దినమున) ఎంతో హీనస్థితిలో ఉంటారు మరియు వారు ఋజుమార్గం నుండి చాలా దూరం వెళ్లి పోయిన వారే

Choose other languages: