Quran Apps in many lanuages:

Surah Al-Kahf Ayahs #64 Translated in Telugu

وَإِذْ قَالَ مُوسَىٰ لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّىٰ أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన సేవకునితో ఇలా అన్నది: రెండు సముద్రాల సంగమ స్థలానికి చేరనంత వరకు నేను నా ప్రయాణాన్ని ఆపను. నేను సంవత్సరాల తరబడి సంచరిస్తూ ఉండవలసినా సరే
فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ سَرَبًا
ఆ పిదప వారిద్దరు ఆ (రెండు సముద్రాల) సంగమ స్థలానికి చేరినప్పుడు, వారి చేపను గురించి మరిచిపోయారు. అది వారి నుండి తప్పించుకొని వేగంగా సముద్రంలోకి - సొరంగం గుండా పోయినట్లు - దూసుకు పోయింది
فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَاهُ آتِنَا غَدَاءَنَا لَقَدْ لَقِينَا مِنْ سَفَرِنَا هَٰذَا نَصَبًا
ఆ పిదప వారు మరికొంత ముందుకు పోయిన తరువాత, అతను (మూసా) తన సేవకునితో ఇలా అన్నాడు: మన భోజనం తీసుకురా! వాస్తవానికి మనం ఈ ప్రయాణంలో చాలా అలసిపోయాము
قَالَ أَرَأَيْتَ إِذْ أَوَيْنَا إِلَى الصَّخْرَةِ فَإِنِّي نَسِيتُ الْحُوتَ وَمَا أَنْسَانِيهُ إِلَّا الشَّيْطَانُ أَنْ أَذْكُرَهُ ۚ وَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ عَجَبًا
(సేవకుడు) ఇలా అన్నాడు: చూశారా! మనం ఆ బండ మీద విశ్రాంతి తీసుకోవటానికి ఆగినపుడు వాస్తవానికి నేను చేపను గురించి పూర్తిగా మరచి పోయాను. షైతాను తప్ప మరెవ్వడూ నన్ను దానిని గురించి మరపింపజేయలేదు. అది విచిత్రంగా సముద్రంలోకి దూసుకొని పోయింది
قَالَ ذَٰلِكَ مَا كُنَّا نَبْغِ ۚ فَارْتَدَّا عَلَىٰ آثَارِهِمَا قَصَصًا
(మూసా) అన్నాడు: అదే కదా, మనం కోరుతున్నది (వెతుకుతున్న స్థానం)!" ఆ పిదప వారిరువురు తమ అడుగుజాడలను అనుసరిస్తూ వెనుకకు మరలిపోయారు

Choose other languages: