Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #5 Translated in Telugu

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ
తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా (బైతుల్ మఖ్దిస్) వరకు రాత్రి వేళ తీసుకు పోయిన ఆయన (అల్లాహ్) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్ లను) చూపటానికి చేశాము. నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు
وَآتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَاهُ هُدًى لِبَنِي إِسْرَائِيلَ أَلَّا تَتَّخِذُوا مِنْ دُونِي وَكِيلًا
మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము మరియు దానిని ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి, దాని ద్వారా ఇలా ఆజ్ఞాపించాము: నన్ను (అల్లాహ్ ను) తప్ప మరెవ్వరినీ సంరక్షకునిగా (కార్యసాధకునిగా) చేసుకోవద్దు
ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ ۚ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا
మేము నూహ్ తో బాటు ఓడలో ఎక్కించిన వారి సంతతివారలారా! నిశ్చయంగా అతను (నూహ్) కృతజ్ఞుడైన దాసుడు
وَقَضَيْنَا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا
మరియు మేము గ్రంథంలో ఇస్రాయీల్ సంతతి వారిని ఇలా హెచ్చరించాము: మీరు భువిలో రెండు సార్లు సంక్షోభాన్ని రేకెత్తిస్తారు, మరియు గొప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తారు
فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَنَا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ ۚ وَكَانَ وَعْدًا مَفْعُولًا
ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధనిపుణులైన మా దాసులను పంపాము. వారు మీ గృహాలలోకి దూసుకెళ్ళారు. మరియు ఈ విధంగా మా వాగ్దానం నెరవేర్చబడింది

Choose other languages: