Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #7 Translated in Telugu

ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ ۚ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا
మేము నూహ్ తో బాటు ఓడలో ఎక్కించిన వారి సంతతివారలారా! నిశ్చయంగా అతను (నూహ్) కృతజ్ఞుడైన దాసుడు
وَقَضَيْنَا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا
మరియు మేము గ్రంథంలో ఇస్రాయీల్ సంతతి వారిని ఇలా హెచ్చరించాము: మీరు భువిలో రెండు సార్లు సంక్షోభాన్ని రేకెత్తిస్తారు, మరియు గొప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తారు
فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَنَا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ ۚ وَكَانَ وَعْدًا مَفْعُولًا
ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధనిపుణులైన మా దాసులను పంపాము. వారు మీ గృహాలలోకి దూసుకెళ్ళారు. మరియు ఈ విధంగా మా వాగ్దానం నెరవేర్చబడింది
ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَأَمْدَدْنَاكُمْ بِأَمْوَالٍ وَبَنِينَ وَجَعَلْنَاكُمْ أَكْثَرَ نَفِيرًا
ఆ తరువాత మేము మీకు వారిపై మరల ప్రాబల్యం వహించే అవకాశం కలిగించాము. మరియు సంపదతోనూ మరియు సంతానంతోనూ మీకు సహాయం చేశాము మరియు మీ సంఖ్యా బలాన్ని కూడా పెంచాము
إِنْ أَحْسَنْتُمْ أَحْسَنْتُمْ لِأَنْفُسِكُمْ ۖ وَإِنْ أَسَأْتُمْ فَلَهَا ۚ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ لِيَسُوءُوا وُجُوهَكُمْ وَلِيَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٍ وَلِيُتَبِّرُوا مَا عَلَوْا تَتْبِيرًا
(మరియు మేము అన్నాము): ఒకవేళ మీరు మేలు చేస్తే అది మీ స్వయం కొరకే మేలు చేసుకున్నట్లు. మరియు ఒకవేళ మీరు కీడు చేస్తే అది మీ కొరకే!" పిదప రెండవ వాగ్దానం రాగా మీ ముఖాలను (మిమ్మల్ని) అవమాన పరచటానికి, మొదటిసారి వారు మస్జిద్ అల్ అఖ్సాలో దూరినట్లు, మరల దూరటానికి మరియు వారికి అందిన ప్రతి దానిని నాశనం చేయటానికి (మీ శత్రువులను మీపైకి పంపాము)

Choose other languages: