Quran Apps in many lanuages:

Surah Al-Hajj Ayahs #14 Translated in Telugu

ذَٰلِكَ بِمَا قَدَّمَتْ يَدَاكَ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِلْعَبِيدِ
(అతనితో): ఇది నీవు నీ చేతులారా చేసి పంపిన దాని (ఫలితం) మరియు నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేయడు!" (అని అనబడుతుంది)
وَمِنَ النَّاسِ مَنْ يَعْبُدُ اللَّهَ عَلَىٰ حَرْفٍ ۖ فَإِنْ أَصَابَهُ خَيْرٌ اطْمَأَنَّ بِهِ ۖ وَإِنْ أَصَابَتْهُ فِتْنَةٌ انْقَلَبَ عَلَىٰ وَجْهِهِ خَسِرَ الدُّنْيَا وَالْآخِرَةَ ۚ ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ
మరియు ప్రజలలో కొందరు అంచున నిలచి (సందేహంతో) అల్లాహ్ ను ఆరాధించే వారున్నారు. (అలాంటివాడు) తనకు లాభం కలిగితే, ఎంతో తృప్తి పొందుతాడు. కాని ఆపదకు గురి అయితే ముఖం త్రిప్పుకొని, ఇహమును మరియు పరమును కూడా కోల్పోతాడు. స్పష్టమైన నష్టమంటే ఇదే
يَدْعُو مِنْ دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُ وَمَا لَا يَنْفَعُهُ ۚ ذَٰلِكَ هُوَ الضَّلَالُ الْبَعِيدُ
అతడు అల్లాహ్ ను వదలి తనకు నష్టం గానీ, లాభం గానీ చేకూర్చలేని వారిని ప్రార్థిస్తున్నాడు. ఇదే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోవటం
يَدْعُو لَمَنْ ضَرُّهُ أَقْرَبُ مِنْ نَفْعِهِ ۚ لَبِئْسَ الْمَوْلَىٰ وَلَبِئْسَ الْعَشِيرُ
ఎవరి వల్ల లాభం కంటే, నష్టమే ఎక్కువ రానున్నదో వారినే అతడు ప్రార్థిస్తున్నాడు. ఎంత నికృష్టుడైన సంరక్షకుడు మరియు ఎంత నికృష్టుడైన అనుచరుడు (అషీరు)
إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۚ إِنَّ اللَّهَ يَفْعَلُ مَا يُرِيدُ
విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, అల్లాహ్ నిశ్చయంగా, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది చేస్తాడు

Choose other languages: