Quran Apps in many lanuages:

Surah Al-Hajj Ayahs #17 Translated in Telugu

يَدْعُو لَمَنْ ضَرُّهُ أَقْرَبُ مِنْ نَفْعِهِ ۚ لَبِئْسَ الْمَوْلَىٰ وَلَبِئْسَ الْعَشِيرُ
ఎవరి వల్ల లాభం కంటే, నష్టమే ఎక్కువ రానున్నదో వారినే అతడు ప్రార్థిస్తున్నాడు. ఎంత నికృష్టుడైన సంరక్షకుడు మరియు ఎంత నికృష్టుడైన అనుచరుడు (అషీరు)
إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۚ إِنَّ اللَّهَ يَفْعَلُ مَا يُرِيدُ
విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, అల్లాహ్ నిశ్చయంగా, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది చేస్తాడు
مَنْ كَانَ يَظُنُّ أَنْ لَنْ يَنْصُرَهُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ فَلْيَمْدُدْ بِسَبَبٍ إِلَى السَّمَاءِ ثُمَّ لْيَقْطَعْ فَلْيَنْظُرْ هَلْ يُذْهِبَنَّ كَيْدُهُ مَا يَغِيظُ
ఎవడైతే - ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా - అల్లాహ్, అతనికి (ప్రవక్తకు) సహాయపడడని భావిస్తాడో! (వాడికి సాధ్యమైతే) వాడిని ఒక త్రాడు సహాయంతో ఆకాశంపైకి పోయి, తరువాత వాటిని (అంటే ప్రవక్తపై అవతరింప జేయబడే వహీ మరియు ఇతర సహాయాలను) త్రెంపి చూడమను, అతడి ఈ యుక్తి అతడి క్రోధావేశాన్ని దూరం చేయగలదేమో
وَكَذَٰلِكَ أَنْزَلْنَاهُ آيَاتٍ بَيِّنَاتٍ وَأَنَّ اللَّهَ يَهْدِي مَنْ يُرِيدُ
మరియు ఈ విధంగా మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) స్పష్టమైన సందేశాలతో అవతరింపజేశాము. మరియు నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు
إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئِينَ وَالنَّصَارَىٰ وَالْمَجُوسَ وَالَّذِينَ أَشْرَكُوا إِنَّ اللَّهَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
నిశ్చయంగా, (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించిన వారి మరియు యూదులు, సాబీయులు, క్రైస్తవులు, మజూసీలు మరియు బహుదైవారాధకులు అయిన వారి మధ్య పునరుత్థాన దినమున అల్లాహ్ తప్పక తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షిగా ఉంటాడు

Choose other languages: