Quran Apps in many lanuages:

Surah Al-Hadid Ayahs #13 Translated in Telugu

هُوَ الَّذِي يُنَزِّلُ عَلَىٰ عَبْدِهِ آيَاتٍ بَيِّنَاتٍ لِيُخْرِجَكُمْ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَإِنَّ اللَّهَ بِكُمْ لَرَءُوفٌ رَحِيمٌ
తన దాసుని (ముహమ్మద్)పై స్పష్టమైన ఆయాత్ (సూచనలు) అవతరింప జేసేవాడు ఆయనే! అతను వాటి ద్వారా మిమ్మల్ని అంధకారం నుండి వెలుతురులోకి తీసుకు రావటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని ఎంతో కనికరించేవాడు, అపార కరుణా ప్రదాత
وَمَا لَكُمْ أَلَّا تُنْفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا يَسْتَوِي مِنْكُمْ مَنْ أَنْفَقَ مِنْ قَبْلِ الْفَتْحِ وَقَاتَلَ ۚ أُولَٰئِكَ أَعْظَمُ دَرَجَةً مِنَ الَّذِينَ أَنْفَقُوا مِنْ بَعْدُ وَقَاتَلُوا ۚ وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
మరియు మీకేమయింది? మీరెందుకు అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టడం లేదు? ఆకాశాలు మరియు భూమి యొక్క వారసత్వం అల్లాహ్ కే చెందుతుంది. (మక్కా) విజయానికి ముందు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టిన వారితో మరియు పోరాడిన వారితో, (మక్కా విజయం తరువాత పోరాడిన వారు మరియు ఖర్చుపెట్టినవారు) సమానులు కాజాలరు! అలాంటి వారి స్థానం (విజయం తరువాత అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టిన మరియు పోరాడిన వారి కంటే గొప్పది. కాని వారందరికీ అల్లాహ్ ఉత్తమమైన (ప్రతిఫలం) వాగ్దానం చేశాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును
مَنْ ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ وَلَهُ أَجْرٌ كَرِيمٌ
అల్లాహ్ కు ఉత్తమమైన అప్పు ఇచ్చేవాడు ఎవడు? ఆయన దానిని ఎన్నో రెట్లు హెచ్చించి తిరిగి అతనికి ఇస్తాడు మరియు అతనికి శ్రేష్ఠమైన ప్రతిఫలం (స్వర్గం) ఉంటుంది
يَوْمَ تَرَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ يَسْعَىٰ نُورُهُمْ بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِمْ بُشْرَاكُمُ الْيَوْمَ جَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
ఆ దినమున నీవు విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను చూస్తే, వారి వెలుగు, వారి ముందు నుండి మరియు వారి కుడి వైపు నుండి పరిగెత్తుతూ ఉంటుంది. (వారితో ఇలా అనబడుతుంది): ఈ రోజు మీకు క్రింద సెలయేర్లు ప్రవహించే స్వర్గవనాల శుభవార్త ఇవ్వబడుతోంది, మీరందులో శాశ్వతంగా ఉంటారు! ఇదే ఆ గొప్ప విజయం
يَوْمَ يَقُولُ الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ لِلَّذِينَ آمَنُوا انْظُرُونَا نَقْتَبِسْ مِنْ نُورِكُمْ قِيلَ ارْجِعُوا وَرَاءَكُمْ فَالْتَمِسُوا نُورًا فَضُرِبَ بَيْنَهُمْ بِسُورٍ لَهُ بَابٌ بَاطِنُهُ فِيهِ الرَّحْمَةُ وَظَاهِرُهُ مِنْ قِبَلِهِ الْعَذَابُ
ఆ రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులతో ఇలా అంటారు: మీరు మా కొరకు కొంచెం వేచి ఉండండి, మేము మీ వెలుగు నుండి కొంచెం తీసుకుంటాము." వారితో ఇలా అనబడుతుంది: మీరు వెనుకకు మరలి పొండి, తరువాత వెలుగు కొరకు వెదకండి!" అప్పుడు వారి మధ్య ఒక గోడ నిలబెట్టబడుతుంది. దానికి ఒక ద్వారముంటుంది, దాని లోపలి వైపు కారుణ్యముంటుంది మరియు దాని బయటవైపు శిక్ష ఉంటుంది

Choose other languages: