Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #92 Translated in Telugu

وَقَالُوا قُلُوبُنَا غُلْفٌ ۚ بَلْ لَعَنَهُمُ اللَّهُ بِكُفْرِهِمْ فَقَلِيلًا مَا يُؤْمِنُونَ
మరియు వారు: మా హృదయాలు మూయబడి ఉన్నాయి."అని అంటారు. అలా కాదు (అది నిజం కాదు)! వారి సత్యతిరస్కారం వలన అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). ఎందుకంటే వారు విశ్వసించేది చాలా తక్కువ
وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِنْ عِنْدِ اللَّهِ مُصَدِّقٌ لِمَا مَعَهُمْ وَكَانُوا مِنْ قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا فَلَمَّا جَاءَهُمْ مَا عَرَفُوا كَفَرُوا بِهِ ۚ فَلَعْنَةُ اللَّهِ عَلَى الْكَافِرِينَ
మరియు ఇప్పుడు వారి వద్ద నున్న దానిని (తౌరాత్ ను) ధృవీకరించే గ్రంథం (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫు నుండి వారి వద్దకు వచ్చింది. మరియు దీనికి ముందు వారు సత్యతిరస్కారులపై విజయం కొరకు ప్రార్థించే వారు. ఇప్పుడు సత్యమని గుర్తించబడినది (ఈ గ్రంథం) వచ్చినా, వారు దానిని తిరస్కరించారు. కాబట్టి, సత్యతిరస్కారులపై అల్లాహ్ అభిశాపం (బహిష్కారం) అవతరిస్తుంది
بِئْسَمَا اشْتَرَوْا بِهِ أَنْفُسَهُمْ أَنْ يَكْفُرُوا بِمَا أَنْزَلَ اللَّهُ بَغْيًا أَنْ يُنَزِّلَ اللَّهُ مِنْ فَضْلِهِ عَلَىٰ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ فَبَاءُوا بِغَضَبٍ عَلَىٰ غَضَبٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُهِينٌ
అల్లాహ్ అవతరింపజేసిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) తిరస్కరించి, వారు ఎంత నీచమైన మూల్యానికి తమను తాము అమ్ముకున్నారు! అది (వారి తిరస్కారం) అల్లాహ్! తన దాసులలో, తాను కోరిన వారిపై, తన అనుగ్రహం (ఖుర్ఆన్ /ప్రవక్తృత్వం) అవతరింపజేశాడనే కక్ష వల్లనే! కనుక వారు (అల్లాహ్) క్రోధం మీద మరింత క్రోధానికి గురయ్యారు. మరియు ఇలాంటి సత్యతిరస్కారులకు అవమానకరమైన శిక్ష ఉంది
وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنْزَلَ اللَّهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنْزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِمَا مَعَهُمْ ۗ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنْبِيَاءَ اللَّهِ مِنْ قَبْلُ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
మరియు వారితో (యూదులతో): అల్లాహ్ అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి." అని అన్నప్పుడు, వారు: మా (ఇస్రాయీల్) వారిపై అవతరింపజేయబడిన దానిని (తౌరాత్ ను) మాత్రమే మేము విశ్వసిస్తాము." అని అంటారు. మరియు దాని తరువాత వచ్చినది (ఈ ఖుర్ఆన్) సత్యమైనప్పటికీ మరియు వారి వద్దనున్న దానిని (తౌరాత్ ను) ధృవపరుస్తున్నప్పటికీ, దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. (ఓ ముహమ్మద్) వారిని అడుగు: మీరు (మీ వద్దనున్న గ్రంథాన్ని) విశ్వసించే వారే అయితే ఇంతకు పూర్వం వచ్చిన అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్యచేస్తూ వచ్చారు
وَلَقَدْ جَاءَكُمْ مُوسَىٰ بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهِ وَأَنْتُمْ ظَالِمُونَ
మరియు వాస్తవానికి మూసా స్పష్టమైన సూచనలను తీసుకొని మీ వద్దకు వచ్చాడు, తరువాత అతను పోగానే, మీరు ఆవుదూడ (విగ్రహాన్ని) ఆరాధ్యదైవంగా చేసుకున్నారు మరియు మీరు ఎంత దుర్మార్గులు

Choose other languages: