Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #95 Translated in Telugu

وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنْزَلَ اللَّهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنْزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِمَا مَعَهُمْ ۗ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنْبِيَاءَ اللَّهِ مِنْ قَبْلُ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
మరియు వారితో (యూదులతో): అల్లాహ్ అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి." అని అన్నప్పుడు, వారు: మా (ఇస్రాయీల్) వారిపై అవతరింపజేయబడిన దానిని (తౌరాత్ ను) మాత్రమే మేము విశ్వసిస్తాము." అని అంటారు. మరియు దాని తరువాత వచ్చినది (ఈ ఖుర్ఆన్) సత్యమైనప్పటికీ మరియు వారి వద్దనున్న దానిని (తౌరాత్ ను) ధృవపరుస్తున్నప్పటికీ, దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. (ఓ ముహమ్మద్) వారిని అడుగు: మీరు (మీ వద్దనున్న గ్రంథాన్ని) విశ్వసించే వారే అయితే ఇంతకు పూర్వం వచ్చిన అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్యచేస్తూ వచ్చారు
وَلَقَدْ جَاءَكُمْ مُوسَىٰ بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهِ وَأَنْتُمْ ظَالِمُونَ
మరియు వాస్తవానికి మూసా స్పష్టమైన సూచనలను తీసుకొని మీ వద్దకు వచ్చాడు, తరువాత అతను పోగానే, మీరు ఆవుదూడ (విగ్రహాన్ని) ఆరాధ్యదైవంగా చేసుకున్నారు మరియు మీరు ఎంత దుర్మార్గులు
وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُمْ بِقُوَّةٍ وَاسْمَعُوا ۖ قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا وَأُشْرِبُوا فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ۚ قُلْ بِئْسَمَا يَأْمُرُكُمْ بِهِ إِيمَانُكُمْ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
మరియు మేము `తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ నుంచి తీసుకున్న ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): మేము మీకు చేస్తున్న వాటిని (ఉపదేశాలను) స్థిరంగా పాటించండి మరియు జాగ్రత్తగా వినండి." అని చెప్పాము. వారు: మేము విన్నాము కానీ అతిక్రమిస్తున్నాము." అని అన్నారు, వారి సత్యతిరస్కారం వలన వారి హృదయాలలో ఆవుదూడ ప్రేమ నిండి పోయింది. వారితో అను: మీరు విశ్వాసులే అయితే! ఈ చెడు చేష్టలను చేయమని మిమ్మల్ని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా చెడ్డది
قُلْ إِنْ كَانَتْ لَكُمُ الدَّارُ الْآخِرَةُ عِنْدَ اللَّهِ خَالِصَةً مِنْ دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِنْ كُنْتُمْ صَادِقِينَ
వారితో ఇలా అను: ఒకవేళ అల్లాహ్ వద్దనున్న పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం, మీకు మాత్రమే ప్రత్యేకించబడి ఉంటే, మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే, మీరు మరణాన్ని కోరండి
وَلَنْ يَتَمَنَّوْهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
కాని వారు ఎన్నటికీ దానిని (మరణాన్ని) కోరరు. ఎందుకంటే, వారు తమ చేతులారా చేసి పంపినవి (తమ కర్మలు) వారికి బాగా తెలుసు. ఈ దుర్మార్గుల విషయం అల్లాహ్ కు బాగా తెలుసు

Choose other languages: