Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #262 Translated in Telugu

أَلَمْ تَرَ إِلَى الَّذِي حَاجَّ إِبْرَاهِيمَ فِي رَبِّهِ أَنْ آتَاهُ اللَّهُ الْمُلْكَ إِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّيَ الَّذِي يُحْيِي وَيُمِيتُ قَالَ أَنَا أُحْيِي وَأُمِيتُ ۖ قَالَ إِبْرَاهِيمُ فَإِنَّ اللَّهَ يَأْتِي بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَأْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِي كَفَرَ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
ఏమీ? అల్లాహ్ (తన అనుగ్రహంతో) సామ్రాజ్యం ఇచ్చిన తరువాత, ఇబ్రాహీమ్ తో అతని ప్రభువు (అల్లాహ్) ను గురించి వాదించిన వ్యక్తి (నమ్రూద్) విషయం నీకు తెలియదా? ఇబ్రాహీమ్: జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో! ఆయనే నా ప్రభువు." అని అన్నప్పుడు, అతడు: చావుబ్రతుకులు రెండూ నా ఆధీనంలోనే ఉన్నాయి." అని అన్నాడు. అప్పుడు ఇబ్రాహీమ్: సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపజేస్తాడు; అయితే నీవు (సూర్యుణ్ణి) పడమర నుండి ఉదయింపజెయ్యి." అని అన్నాడు. దానితో ఆ సత్యతిరస్కారి చికాకు పడ్డాడు. మరియు అల్లాహ్ దుర్మార్గం అవలంబించిన ప్రజలకు సన్మార్గం చూపడు
أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَلْ لَبِثْتَ مِائَةَ عَامٍ فَانْظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانْظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِلنَّاسِ ۖ وَانْظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنْشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
లేక! ఒక వ్యక్తి ఇండ్ల కప్పులన్నీ కూలిపోయి, పాడుపడిన (తలక్రిందులై బోర్లా పడిన) నగరం మీదుగా పోతూ: వాస్తవానికి! నశించిపోయిన ఈ నగరానికి అల్లాహ్ తిరిగి ఏ విధంగా జీవం పోయగలడు?" అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అతనిని మరణింపజేసి నూరు సంవత్సరాల తరువాత తిరిగి బ్రతికింపజేసి: ఈ స్థితిలో నీవు ఎంతకాలముంటివి?" అని అడిగాడు. అతడు: ఒక దినమో, లేక ఒక దినములో కొంత భాగమో!" అని అన్నాడు. దానికి ఆయన: కాదు, నీవు ఇక్కడ ఈ (మరణించిన) స్థితిలో, నూరు సంవత్సరాలు ఉంటివి. ఇక నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏ మార్పూ లేదు. ఇంకా నీవు నా గాడిదను కూడా చూడు! మేము ప్రజల కొరకు నిన్ను దృష్టాంతంగా చేయదలిచాము. ఇక ఆ (గాడిద) ఎముకలను చూడు, ఏ విధంగా వాటిని ఉద్ధరించి తిరిగి వాటిపై మాంసం కప్పుతామో!" అని అన్నాడు. ఇవి అతనికి స్పష్టంగా తెలిసిన తరువాత అతడు: నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడని నాకు (ఇప్పుడు) తెలిసింది!" అని అన్నాడు
وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَىٰ ۖ قَالَ أَوَلَمْ تُؤْمِنْ ۖ قَالَ بَلَىٰ وَلَٰكِنْ لِيَطْمَئِنَّ قَلْبِي ۖ قَالَ فَخُذْ أَرْبَعَةً مِنَ الطَّيْرِ فَصُرْهُنَّ إِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلَىٰ كُلِّ جَبَلٍ مِنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ يَأْتِينَكَ سَعْيًا ۚ وَاعْلَمْ أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో నాకు చూపు!" అని అన్నప్పుడు, (అల్లాహ్) అన్నాడు: ఏమీ? నీకు విశ్వాసం లేదా?" దానికి (ఇబ్రాహీమ్): ఉంది, కానీ నా మనస్సు తృప్తి కొరకు అడుగు తున్నాను!" అని అన్నాడు. అపుడు (అల్లాహ్): నాలుగు పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో! తరువాత (వాటిని కోసి) ఒక్కొక్కదాని ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క కొండపై పెట్టి రా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకో!"అని అన్నాడు
مَثَلُ الَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنْبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنْبُلَةٍ مِائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَنْ يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం: ఆ విత్తనం వలే ఉంటుంది, దేని నుండి అయితే ఏడు వెన్నులు పుట్టి ప్రతి వెన్నులో నూరేసి గింజలు ఉంటాయో! మరియు అల్లాహ్ తాను కోరిన వారికి హెచ్చుగా నొసంగుతాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు
الَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ ثُمَّ لَا يُتْبِعُونَ مَا أَنْفَقُوا مَنًّا وَلَا أَذًى ۙ لَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఎవరైతే, అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి, ఆ తరువాత తాము చేసిన ఉపకారాన్ని చెప్పుకుంటూ మరియు వారిని బాధిస్తూ ఉండరో, అలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు వద్ద ఉంది. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా

Choose other languages: