Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #233 Translated in Telugu

الطَّلَاقُ مَرَّتَانِ ۖ فَإِمْسَاكٌ بِمَعْرُوفٍ أَوْ تَسْرِيحٌ بِإِحْسَانٍ ۗ وَلَا يَحِلُّ لَكُمْ أَنْ تَأْخُذُوا مِمَّا آتَيْتُمُوهُنَّ شَيْئًا إِلَّا أَنْ يَخَافَا أَلَّا يُقِيمَا حُدُودَ اللَّهِ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا يُقِيمَا حُدُودَ اللَّهِ فَلَا جُنَاحَ عَلَيْهِمَا فِيمَا افْتَدَتْ بِهِ ۗ تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَعْتَدُوهَا ۚ وَمَنْ يَتَعَدَّ حُدُودَ اللَّهِ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగనంపాలి. మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖులా తీసుకంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు
فَإِنْ طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهُ مِنْ بَعْدُ حَتَّىٰ تَنْكِحَ زَوْجًا غَيْرَهُ ۗ فَإِنْ طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَنْ يَتَرَاجَعَا إِنْ ظَنَّا أَنْ يُقِيمَا حُدُودَ اللَّهِ ۗ وَتِلْكَ حُدُودُ اللَّهِ يُبَيِّنُهَا لِقَوْمٍ يَعْلَمُونَ
ఒకవేళ అతడు (మూడవసారి) విడాకులిస్తే, ఆ తర్వాత ఆ స్త్రీ అతనికి ధర్మసమ్మతం కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప! ఒకవేళ అతడు (రెండవ భర్త) ఆమెకు విడాకులిస్తే! అప్పుడు ఉభయులూ (మొదటి భర్త, ఈ స్త్రీ) తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు మరియు ఇవి అల్లాహ్ నియమించిన హద్దులు. వీటిని ఆయన గ్రహించే వారికి స్పష్టపరుస్తున్నాడు
وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ سَرِّحُوهُنَّ بِمَعْرُوفٍ ۚ وَلَا تُمْسِكُوهُنَّ ضِرَارًا لِتَعْتَدُوا ۚ وَمَنْ يَفْعَلْ ذَٰلِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ وَلَا تَتَّخِذُوا آيَاتِ اللَّهِ هُزُوًا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ وَمَا أَنْزَلَ عَلَيْكُمْ مِنَ الْكِتَابِ وَالْحِكْمَةِ يَعِظُكُمْ بِهِ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
మరియు మీరు స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు, వారి కొరకు నిర్ణయించబడిన గడువు (ఇద్దత్) సమీపిస్తే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోండి, లేదా సహృదయంతో విడిచి పెట్టండి. కేవలం వారికి బాధ కలిగించే మరియు పీడించే ఉద్దేశ్యంతో వారిని ఉంచుకోకండి మరియు ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకన్నట్లు. మరియు అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకోకండి. మరియు అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని మరియు మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు వివేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన (అల్లాహ్) మీకు ఈ విధంగా బోధిస్తున్నాడు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి
وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَلَا تَعْضُلُوهُنَّ أَنْ يَنْكِحْنَ أَزْوَاجَهُنَّ إِذَا تَرَاضَوْا بَيْنَهُمْ بِالْمَعْرُوفِ ۗ ذَٰلِكَ يُوعَظُ بِهِ مَنْ كَانَ مِنْكُمْ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۗ ذَٰلِكُمْ أَزْكَىٰ لَكُمْ وَأَطْهَرُ ۗ وَاللَّهُ يَعْلَمُ وَأَنْتُمْ لَا تَعْلَمُونَ
మరియు మీరు మీ స్త్రీలకు (మొదటి సారి లేక రెండవసారి) విడాకులిస్తే, వారు తమ నిరీక్షణా వ్యవధిని (ఇద్దత్ ను) పూర్తి చేసిన తరువాత, తమ (మొదటి) భర్తలను ధర్మసమ్మతంగా పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోదలిస్తే, మీరు వారిని ఆటంకపరచకండి. మీలో ఎవరికి అల్లాహ్ యందు మరియు అంతిమ దినము నందు విశ్వాసముందో, వారికి ఈ బోధన చేయబడుతోంది. ఇది మీకు నిష్కళంకమైనది మరియు నిర్మలమైనది. మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు
وَالْوَالِدَاتُ يُرْضِعْنَ أَوْلَادَهُنَّ حَوْلَيْنِ كَامِلَيْنِ ۖ لِمَنْ أَرَادَ أَنْ يُتِمَّ الرَّضَاعَةَ ۚ وَعَلَى الْمَوْلُودِ لَهُ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوفِ ۚ لَا تُكَلَّفُ نَفْسٌ إِلَّا وُسْعَهَا ۚ لَا تُضَارَّ وَالِدَةٌ بِوَلَدِهَا وَلَا مَوْلُودٌ لَهُ بِوَلَدِهِ ۚ وَعَلَى الْوَارِثِ مِثْلُ ذَٰلِكَ ۗ فَإِنْ أَرَادَا فِصَالًا عَنْ تَرَاضٍ مِنْهُمَا وَتَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَيْهِمَا ۗ وَإِنْ أَرَدْتُمْ أَنْ تَسْتَرْضِعُوا أَوْلَادَكُمْ فَلَا جُنَاحَ عَلَيْكُمْ إِذَا سَلَّمْتُمْ مَا آتَيْتُمْ بِالْمَعْرُوفِ ۗ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
(విడాకుల తరువాత) పూర్తి రెండు సంవత్సరాల పాల గడువు పూర్తి చేయవలెనని (తల్లిదండ్రులు) కోరినట్లయితే, తల్లులు తమ పిల్లలకు పాలివ్వాలి. బిడ్డ తండ్రిపై, వారికి తగు రీతిగా భోజనం మరియు వస్త్రాలిచ్చి పోషించవలసిన బాధ్యత ఉంటుంది. శక్తికి మించిన భారం ఏ వ్యక్తిపై కూడా మోపబడదు. తల్లి తన బిడ్డ వలన కష్టాలకు గురి కాకూడదు. మరియు తండ్రి కూడా తన బిడ్డ వలన (కష్టాలకు గురి కాకూడదు). మరియు (పాలిచ్చే తల్లిని పోషించే బాధ్యత తండ్రిపై ఉన్నట్లు తండ్రి చనిపోతే) అతని వారసులపై కూడా ఉంటుంది. మరియు (తల్లిదండ్రులు) ఇరువురు సంప్రదించుకొని పరస్పర అంగీకారంతో (రెండు సంవత్సరాలు పూర్తికాక ముందే) బిడ్డ చేత పాలు విడిపిస్తే, వారిరువురికి ఎలాంటి దోషం లేదు. మరియు మీరు మీ బిడ్డలకు వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చేయదలిస్తే, మీపై ఎలాంటి దోషం లేదు. కాని మీరు ఆమెకు (తల్లికి) ఇవ్వ వలసింది ధర్మసమ్మతంగా చెల్లించాలి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు చేసేదంతా నిశ్చయంగా, అల్లాహ్ చూస్తున్నాడని తెలుసుకోండి

Choose other languages: