Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #214 Translated in Telugu

هَلْ يَنْظُرُونَ إِلَّا أَنْ يَأْتِيَهُمُ اللَّهُ فِي ظُلَلٍ مِنَ الْغَمَامِ وَالْمَلَائِكَةُ وَقُضِيَ الْأَمْرُ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
ఏమీ? అల్లాహ్ స్వయంగా దేవదూతలతో పాటు, మేఘాల ఛాయలలో ప్రత్యక్షం కావాలని వారు నిరీక్షిస్తున్నారా? కానీ, అప్పటికే ప్రతి విషయపు తీర్పు జరిగి ఉంటుంది. మరియు సమస్త విషయాలు (తీర్పు కొరకు) అల్లాహ్ దగ్గరికే మరలింపబడతాయి
سَلْ بَنِي إِسْرَائِيلَ كَمْ آتَيْنَاهُمْ مِنْ آيَةٍ بَيِّنَةٍ ۗ وَمَنْ يُبَدِّلْ نِعْمَةَ اللَّهِ مِنْ بَعْدِ مَا جَاءَتْهُ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
మేము ఎన్ని స్పష్టమైన సూచన (ఆయత్) లను వారికి చూపించామో ఇస్రాయీల్ సంతతి వారిని అడగండి! మరియు ఎవడు అల్లాహ్ యొక్క అనుగ్రహాలను పొందిన తరువాత, వాటిని తారుమారు చేస్తాడో! నిశ్చయంగా, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించటంలో ఎంతో కఠినుడు
زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا الْحَيَاةُ الدُّنْيَا وَيَسْخَرُونَ مِنَ الَّذِينَ آمَنُوا ۘ وَالَّذِينَ اتَّقَوْا فَوْقَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَنْ يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
సత్యతిరస్కారులకు ఇహలోక జీవితం మనోహరమైనదిగా చేయబడింది. కావున వారు విశ్వాసులతో పరిహాసాలాడుతుంటారు. కానీ, పునరుత్థాన దినమున, దైవభీతి గలవారే వారి కంటే ఉన్నత స్థానంలో ఉంటారు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు
كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً فَبَعَثَ اللَّهُ النَّبِيِّينَ مُبَشِّرِينَ وَمُنْذِرِينَ وَأَنْزَلَ مَعَهُمُ الْكِتَابَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فِيمَا اخْتَلَفُوا فِيهِ ۚ وَمَا اخْتَلَفَ فِيهِ إِلَّا الَّذِينَ أُوتُوهُ مِنْ بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ بَغْيًا بَيْنَهُمْ ۖ فَهَدَى اللَّهُ الَّذِينَ آمَنُوا لِمَا اخْتَلَفُوا فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِهِ ۗ وَاللَّهُ يَهْدِي مَنْ يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ
పూర్వం, మానవులంతా ఒకే ఒక సమాజంగా ఉండేవారు. అప్పుడు అల్లాహ్ వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు హెచ్చరికలు చేయటానికి ప్రవక్తలను పంపాడు. మరియు మానవులలో ఏర్పడిన భేదాలను పరిష్కరించటానికి, ఆయన గ్రంథాన్ని సత్యంతో వారి ద్వారా అవతరింపజేశాడు మరియు అది (దివ్యగ్రంథం) ఇవ్వబడిన వారు, స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడా, పరస్పర ద్వేషాల వల్ల భేదాభిప్రాయాలు పుట్టించుకున్నారు. కాని అల్లాహ్ తన ఆజ్ఞతో, విశ్వాసులకు వారు వివాదాలాడుతున్న విషయంలో సత్యమార్గాన్ని చూపాడు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు
أَمْ حَسِبْتُمْ أَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُمْ مَثَلُ الَّذِينَ خَلَوْا مِنْ قَبْلِكُمْ ۖ مَسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ
ఏమీ? మీరు (సులభంగా) స్వర్గంలో ప్రవేశించగలమని భావిస్తున్నారా? మీ పూర్వీకులు సహించినటువంటి (కష్టాలు) మీరూ సహించనిదే! వారిపై దురవస్థ, రోగబాధలు విరుచుకు పడ్డాయి మరియు వారు కుదిపివేయబడ్డారు, చివరకు అప్పటి సందేశహరుడు మరియు విశ్వాసులైన అతని సహచరులు: అల్లాహ్ సహాయం ఇంకా ఎప్పుడొస్తుంది?" అని వాపోయారు. అదిగో నిశ్చయంగా అల్లాహ్ సహాయం సమీపంలోనే ఉంది

Choose other languages: