Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #201 Translated in Telugu

الْحَجُّ أَشْهُرٌ مَعْلُومَاتٌ ۚ فَمَنْ فَرَضَ فِيهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ يَعْلَمْهُ اللَّهُ ۗ وَتَزَوَّدُوا فَإِنَّ خَيْرَ الزَّادِ التَّقْوَىٰ ۚ وَاتَّقُونِ يَا أُولِي الْأَلْبَابِ
హజ్జ్ నియమిత నెలలోనే జరుగుతుంది. ఈ నిర్ణీత మాసాలలో హజ్జ్ చేయటానికి సంకల్పించిన వ్యక్తి హజ్జ్ (ఇహ్రామ్)లో వున్న సమయంలో (భార్యతో) రతిక్రీడ (రఫస్)కు, దుష్టకార్యాలకు మరియు కలహాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే మంచిపనులన్నీ అల్లాహ్ కు తెలుసు. (హజ్జ్ యాత్రకు) కావలసిన వస్తు సామాగ్రిని తీసుకు వెళ్ళండి. దైవభీతియే నిశ్చయంగా అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి. కనుక ఓ బుద్ధమంతులారా! కేవలం నా యందే భయభక్తులు కలిగి ఉండండి
لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَنْ تَبْتَغُوا فَضْلًا مِنْ رَبِّكُمْ ۚ فَإِذَا أَفَضْتُمْ مِنْ عَرَفَاتٍ فَاذْكُرُوا اللَّهَ عِنْدَ الْمَشْعَرِ الْحَرَامِ ۖ وَاذْكُرُوهُ كَمَا هَدَاكُمْ وَإِنْ كُنْتُمْ مِنْ قَبْلِهِ لَمِنَ الضَّالِّينَ
(హజ్జ్ యాత్రలో) మీరు మీ ప్రభువు అనుగ్రహాలు అన్వేషిస్తే అందులో దోషం లేదు. అరఫాత్ నుండి బయలు దేరిన తరువాత మష్అరిల్ హరామ్ (ముజ్`దలిఫా) వద్ద (ఆగి) అల్లాహ్ ను స్మరించండి. మరియు ఆయన మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి, వాస్తవానికి మీరు పూర్వం మార్గభ్రష్టులుగా ఉండేవారు
ثُمَّ أَفِيضُوا مِنْ حَيْثُ أَفَاضَ النَّاسُ وَاسْتَغْفِرُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
తరువాత ప్రజలంతా ఎక్కడి నుండి వెళ్తారో అక్కడి నుండి మీరూ వెళ్ళండి. అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకోండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు అపార కరుణా ప్రదాత
فَإِذَا قَضَيْتُمْ مَنَاسِكَكُمْ فَاذْكُرُوا اللَّهَ كَذِكْرِكُمْ آبَاءَكُمْ أَوْ أَشَدَّ ذِكْرًا ۗ فَمِنَ النَّاسِ مَنْ يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ
ఇక మీ (హజ్జ్) విధులను పూర్తి చేసిన తరువాత, మీరు మీ తండ్రితాతలను (పూర్వం) స్మరించే విధంగా, ఇంకా దాని కంటే అధికంగా అల్లాహ్ ను స్మరించండి. కాని వారిలో కొందరు: ఓ మా ప్రభూ! మాకు ఈ లోకంలో (అన్నీ) ప్రసాదించు!" అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి భాగం ఉండదు
وَمِنْهُمْ مَنْ يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
వారిలో మరికొందరు: ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు!" అని ప్రార్థిస్తారు

Choose other languages: