Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #101 Translated in Telugu

أَفَأَمِنَ أَهْلُ الْقُرَىٰ أَنْ يَأْتِيَهُمْ بَأْسُنَا بَيَاتًا وَهُمْ نَائِمُونَ
ఏమీ? ఈ నగరాలవాసులు, తాము నిద్రపోయేటప్పుడు రాత్రి సమయమన వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా
أَوَأَمِنَ أَهْلُ الْقُرَىٰ أَنْ يَأْتِيَهُمْ بَأْسُنَا ضُحًى وَهُمْ يَلْعَبُونَ
లేదా ఈ నగరాల వాసులు, పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా
أَفَأَمِنُوا مَكْرَ اللَّهِ ۚ فَلَا يَأْمَنُ مَكْرَ اللَّهِ إِلَّا الْقَوْمُ الْخَاسِرُونَ
ఏమీ? వారు అల్లాహ్ యుక్తి (శిక్ష) నుండి నిర్భయంగా ఉన్నారా? నాశనం కాబోయే వారు తప్ప ఇతర జాతి వారెవ్వరూ అల్లాహ్ యుక్తి గురించి నిర్భయంగా ఉండజాలరు
أَوَلَمْ يَهْدِ لِلَّذِينَ يَرِثُونَ الْأَرْضَ مِنْ بَعْدِ أَهْلِهَا أَنْ لَوْ نَشَاءُ أَصَبْنَاهُمْ بِذُنُوبِهِمْ ۚ وَنَطْبَعُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَسْمَعُونَ
ఏమీ? పూర్వపు భూలోకవాసుల తరువాత, భూమికి వారసులయిన వారికి, మేము కోరితే వారి పాపాల వలన వారికి కూడా శిక్ష విధించగలమని ఉపదేశం అందలేదా? మరియు మేము, వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాము, దాని వల్ల వారు (మా హితోపదేశాన్ని) వినలేకున్నారు
تِلْكَ الْقُرَىٰ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنْبَائِهَا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ فَمَا كَانُوا لِيُؤْمِنُوا بِمَا كَذَّبُوا مِنْ قَبْلُ ۚ كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ قُلُوبِ الْكَافِرِينَ
ఈ నగరాల వృత్తాంతాలను కొన్నింటిని మేము నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన (నిదర్శనాలు) తీసుకొని వచ్చారు. కాని వారు ముందు తిరస్కరించిన దానిని మరల విశ్వసించలేదు. ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారుల హృదయాలపై ముద్ర వేస్తాడు

Choose other languages: