Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #41 Translated in Telugu

فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۚ أُولَٰئِكَ يَنَالُهُمْ نَصِيبُهُمْ مِنَ الْكِتَابِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنْتُمْ تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنْفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ
ఇక అల్లాహ్ పై అసత్యాలు కల్పించే వాని కంటే; లేదా ఆయన సూచనలను అసత్యాలని తిరస్కరించే వాని కంటే మించిన దుర్మార్గుడెవడు? అలాంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగ్యాన్ని పొందుతారు. తుదకు మేము పంపే దైవదూతలు వారి ప్రాణాలు తీయటానికి వారి వద్దకు వచ్చి: మీరు అల్లాహ్ ను వదలి ప్రార్థించేవారు (ఆ దైవాలు) ఇపుడు ఎక్కడున్నారు?" అని అడుగుతారు. వారిలా జవాబిస్తారు: వారు మమ్మల్ని వదిలి పోయారు." మరియు ఈ విధంగా వారు: మేము నిజంగానే సత్యతిరస్కారులమై ఉండేవారము." అని తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిచ్చుకుంటారు
قَالَ ادْخُلُوا فِي أُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ فِي النَّارِ ۖ كُلَّمَا دَخَلَتْ أُمَّةٌ لَعَنَتْ أُخْتَهَا ۖ حَتَّىٰ إِذَا ادَّارَكُوا فِيهَا جَمِيعًا قَالَتْ أُخْرَاهُمْ لِأُولَاهُمْ رَبَّنَا هَٰؤُلَاءِ أَضَلُّونَا فَآتِهِمْ عَذَابًا ضِعْفًا مِنَ النَّارِ ۖ قَالَ لِكُلٍّ ضِعْفٌ وَلَٰكِنْ لَا تَعْلَمُونَ
(అల్లాహ్) అంటాడు: మీకు పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవుల సమాజాలు పోయి చేరిన ఆ నరకాగ్నిలోకి ప్రవేశించండి." ప్రతి సమాజం (నరకంలో) ప్రవేశించినపుడు తన పూర్వపు వారిని (సమాజాన్ని) శపిస్తుంది. తుదకు వారంతా అక్కడ చేరిన పిదప; తరువాత వచ్చిన వారు తమ కంటే ముందు వచ్చని వారిని గురించి: ఓ మా ప్రభూ! వీరే మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసినవారు, కావున వీరికి రెట్టింపు నరకాగ్ని శిక్ష విధించు!" అని అంటారు. దానికి (అల్లాహ్): ప్రతి వాడికి రెట్టింపు (శిక్ష) విధించబడుతుంది. కాని మీరది తెలుసుకోలేరు!" అని అంటాడు
وَقَالَتْ أُولَاهُمْ لِأُخْرَاهُمْ فَمَا كَانَ لَكُمْ عَلَيْنَا مِنْ فَضْلٍ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْسِبُونَ
మరియు అప్పుడు మొదటి వారు తరువాత వచ్చిన వారితో: మీకు మాపై ఎలాంటి ఆధిక్యకత లేదు కావున మీరు కూడా మీ కర్మలకు బదులుగా శిక్షను చవి చూడండి!" అని అంటారు
إِنَّ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ وَلَا يَدْخُلُونَ الْجَنَّةَ حَتَّىٰ يَلِجَ الْجَمَلُ فِي سَمِّ الْخِيَاطِ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُجْرِمِينَ
నిశ్చయంగా, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారి కొరకు మరియు వాటి పట్ల దురహంకారం చూపిన వారి కొరకు ఆకాశ ద్వారాలు ఏ మాత్రం తెరువబడవు. మరియు ఒంటె సూదిబెజ్జంలో నుండి దూరి పోగలిగేవరకు వారు స్వర్గంలో ప్రవేశించజాలరు. మరియు ఈ విధంగా మేము అపరాధులకు ప్రతిఫలమిస్తాము
لَهُمْ مِنْ جَهَنَّمَ مِهَادٌ وَمِنْ فَوْقِهِمْ غَوَاشٍ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
నరకమే వారి పాన్పు మరియు వారి దుప్పటి అవుతుంది. మరియు ఈ విధంగా మేము దుర్మార్గులకు ప్రతిఫలమిస్తాము

Choose other languages: