Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #43 Translated in Telugu

وَقَالَتْ أُولَاهُمْ لِأُخْرَاهُمْ فَمَا كَانَ لَكُمْ عَلَيْنَا مِنْ فَضْلٍ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْسِبُونَ
మరియు అప్పుడు మొదటి వారు తరువాత వచ్చిన వారితో: మీకు మాపై ఎలాంటి ఆధిక్యకత లేదు కావున మీరు కూడా మీ కర్మలకు బదులుగా శిక్షను చవి చూడండి!" అని అంటారు
إِنَّ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ وَلَا يَدْخُلُونَ الْجَنَّةَ حَتَّىٰ يَلِجَ الْجَمَلُ فِي سَمِّ الْخِيَاطِ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُجْرِمِينَ
నిశ్చయంగా, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారి కొరకు మరియు వాటి పట్ల దురహంకారం చూపిన వారి కొరకు ఆకాశ ద్వారాలు ఏ మాత్రం తెరువబడవు. మరియు ఒంటె సూదిబెజ్జంలో నుండి దూరి పోగలిగేవరకు వారు స్వర్గంలో ప్రవేశించజాలరు. మరియు ఈ విధంగా మేము అపరాధులకు ప్రతిఫలమిస్తాము
لَهُمْ مِنْ جَهَنَّمَ مِهَادٌ وَمِنْ فَوْقِهِمْ غَوَاشٍ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
నరకమే వారి పాన్పు మరియు వారి దుప్పటి అవుతుంది. మరియు ఈ విధంగా మేము దుర్మార్గులకు ప్రతిఫలమిస్తాము
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
కాని, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వ్యక్తికి, మేము అతని శక్తికి మించిన భారం వేయము. ఇటువంటి వారే స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
وَنَزَعْنَا مَا فِي صُدُورِهِمْ مِنْ غِلٍّ تَجْرِي مِنْ تَحْتِهِمُ الْأَنْهَارُ ۖ وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي هَدَانَا لِهَٰذَا وَمَا كُنَّا لِنَهْتَدِيَ لَوْلَا أَنْ هَدَانَا اللَّهُ ۖ لَقَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ۖ وَنُودُوا أَنْ تِلْكُمُ الْجَنَّةُ أُورِثْتُمُوهَا بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
మరియు మేము వారి హృదయాల నుండి పరస్పర ద్వేషభావాలను తొలగిస్తాము. వారి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు వారు ఇలా అంటారు: మాకు ఇక్కడికి చేరటానికి సన్మార్గం చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. అల్లాహ్ మాకు ఈ సన్మార్గం చూపకపోతే మేము సన్మార్గం పొంది ఉండేవారమ కాదు. మా ప్రభువు పంపిన ప్రవక్తలు వాస్తవంగా సత్యాన్నే తీసుకు వచ్చారు!" అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా, మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే

Choose other languages: