Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #199 Translated in Telugu

أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا ۖ أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۗ قُلِ ادْعُوا شُرَكَاءَكُمْ ثُمَّ كِيدُونِ فَلَا تُنْظِرُونِ
ఏమీ? వారికి కాళ్ళున్నాయా, వాటితో నడవటానికి? లేదా వారికి చేతులున్నాయా, వాటితో పట్టుకోవటానికి? లేదా వారికి కళ్ళున్నాయా, వాటితో చూడటానికి? లేదా వారికి చెవులున్నాయా, వాటిలో వినటానికి? వారితో అను: మీరు సాటి కల్పించిన వారిని (భాగస్వాములను) పిలువండి. తరువాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు (వ్యూహాలు) పన్నండి, నాకు గడువు కూడా ఇవ్వకండి
إِنَّ وَلِيِّيَ اللَّهُ الَّذِي نَزَّلَ الْكِتَابَ ۖ وَهُوَ يَتَوَلَّى الصَّالِحِينَ
నిశ్చయంగా, ఈ గ్రంథాన్ని అవతరింప జేసిన అల్లాహ్ యే నా సంరక్షకుడు, ఆయన సద్వర్తనులనే మిత్రులుగా చేసుకుంటాడు
وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ لَا يَسْتَطِيعُونَ نَصْرَكُمْ وَلَا أَنْفُسَهُمْ يَنْصُرُونَ
మరియు ఆయనను విడిచి మీరు వేడుకునే వారు మీకు ఏ విధమైన సహాయం చేయలేరు. మరియు వారు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు
وَإِنْ تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَسْمَعُوا ۖ وَتَرَاهُمْ يَنْظُرُونَ إِلَيْكَ وَهُمْ لَا يُبْصِرُونَ
మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు వినలేరు. మరియు వారు నీవైపుకు చూస్తున్నట్లు నీవు భావిస్తావు, కాని వారు చూడలేరు
خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ
మన్నింపు వైఖరిని అవలంబించు, ధర్మమును బోధించు మరియు మూర్ఖుల నుండి విముఖుడవకు

Choose other languages: