Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #188 Translated in Telugu

أَوَلَمْ يَتَفَكَّرُوا ۗ مَا بِصَاحِبِهِمْ مِنْ جِنَّةٍ ۚ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ مُبِينٌ
ఏమీ? తన సహచరుడు పిచ్చి పట్టిన వాడు కాదని వారు గమనించలేదా? అతను కేవలం స్పష్టమైన హెచ్చరిక చేసేవాడు మాత్రమే
أَوَلَمْ يَنْظُرُوا فِي مَلَكُوتِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا خَلَقَ اللَّهُ مِنْ شَيْءٍ وَأَنْ عَسَىٰ أَنْ يَكُونَ قَدِ اقْتَرَبَ أَجَلُهُمْ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ
ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు
مَنْ يُضْلِلِ اللَّهُ فَلَا هَادِيَ لَهُ ۚ وَيَذَرُهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడెవ్వడూ లేడు! మరియు ఆయన వారిని తమ తలబిరుసుతనంలో త్రోవతప్పి తిరుగటానికి వదలిపెడుతున్నాడు
يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِنْدَ رَبِّي ۖ لَا يُجَلِّيهَا لِوَقْتِهَا إِلَّا هُوَ ۚ ثَقُلَتْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا تَأْتِيكُمْ إِلَّا بَغْتَةً ۗ يَسْأَلُونَكَ كَأَنَّكَ حَفِيٌّ عَنْهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِنْدَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను ఆ అంతిమఘడియను గురించి: అది ఎప్పుడు రానున్నది?" అని అడుగుతున్నారు. వారితో ఇలా అను: నిస్సందేహంగా, దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమే ఉంది. కేవలం ఆయన స్వయంగా దానిని, దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమ్యాకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగానే వచ్చి పడుతుంది." దానిని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి, వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానం ఇవ్వు: నిస్సందేహంగా, దాని జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది. కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు
قُلْ لَا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ وَلَوْ كُنْتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِقَوْمٍ يُؤْمِنُونَ
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం గానీ, నష్టం గానీ చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయజ్ఞానం ఉండి ఉన్నట్లైతే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే

Choose other languages: