Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #176 Translated in Telugu

وَإِذْ أَخَذَ رَبُّكَ مِنْ بَنِي آدَمَ مِنْ ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنْفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا بَلَىٰ ۛ شَهِدْنَا ۛ أَنْ تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَٰذَا غَافِلِينَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) నీ ప్రభువు ఆదమ్ సంతతి వారి వీపున నుండి వారి సంతానాన్ని తీసి, వారికి వారినే సాక్షులుగా నిలబెట్టి: ఏమీ? నేను మీ ప్రభువును కానా?" అని అడుగగా! వారు: అవును! (నీవే మా ప్రభువని) మేము సాక్ష్యమిస్తున్నాము." అని జవాబిచ్చారు. తీర్పుదినమున మీరు: నిశ్చయంగా, మేము దీనిని ఎరుగము." అని అనగూడదని
أَوْ تَقُولُوا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِنْ قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِنْ بَعْدِهِمْ ۖ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُونَ
లేక: వాస్తవానికి ఇంతకు పూర్వం మా తాతముత్తాతలు అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించారు. మేము వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారం (కాబట్టి వారిని అనుసరించాము). అయితే? ఆ అసత్యవాదులు చేసిన కర్మలకు నీవు మమ్మల్ని నశింప జేస్తావా?" అని అనగూడదని
وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلَعَلَّهُمْ يَرْجِعُونَ
మరియు ఈ విధంగానైనా వారు సన్మార్గానికి మరలుతారేమోనని మేము ఈ సూచనలను స్పష్టంగా తెలుపుతున్నాము
وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ الَّذِي آتَيْنَاهُ آيَاتِنَا فَانْسَلَخَ مِنْهَا فَأَتْبَعَهُ الشَّيْطَانُ فَكَانَ مِنَ الْغَاوِينَ
మరియు మేము, మా సూచనలు (ఆయాత్) ప్రసాదించిన ఆ వ్యక్తి గాథ వారికి వినిపించు. అతడు వాటి నుండి విముఖుడై నందుకు షైతాన్ అతనిని వెంబడించాడు, కావున అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు
وَلَوْ شِئْنَا لَرَفَعْنَاهُ بِهَا وَلَٰكِنَّهُ أَخْلَدَ إِلَى الْأَرْضِ وَاتَّبَعَ هَوَاهُ ۚ فَمَثَلُهُ كَمَثَلِ الْكَلْبِ إِنْ تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ أَوْ تَتْرُكْهُ يَلْهَثْ ۚ ذَٰلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ
మరియు మేము కోరుకుంటే వాటి (ఆ సూచనల) ద్వారా అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించేవారము. కాని అతడు భూమి వైపునకు వంగాడు, మరియు తన కోరికలను అనుసరించాడు. అతని దృష్టాంతం ఆ కుక్క వలె ఉంది: నీవు దానిని బెదిరించినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది, లేక వదలి పెట్టినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది. మా సూచన (ఆయాత్) లను అబద్ధాలని నిరాకరించే వారి దృష్టాంతం కూడా ఇదే! నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉంటే, బహుశా వారు ఆలోచించవచ్చు

Choose other languages: