Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #178 Translated in Telugu

وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلَعَلَّهُمْ يَرْجِعُونَ
మరియు ఈ విధంగానైనా వారు సన్మార్గానికి మరలుతారేమోనని మేము ఈ సూచనలను స్పష్టంగా తెలుపుతున్నాము
وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ الَّذِي آتَيْنَاهُ آيَاتِنَا فَانْسَلَخَ مِنْهَا فَأَتْبَعَهُ الشَّيْطَانُ فَكَانَ مِنَ الْغَاوِينَ
మరియు మేము, మా సూచనలు (ఆయాత్) ప్రసాదించిన ఆ వ్యక్తి గాథ వారికి వినిపించు. అతడు వాటి నుండి విముఖుడై నందుకు షైతాన్ అతనిని వెంబడించాడు, కావున అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు
وَلَوْ شِئْنَا لَرَفَعْنَاهُ بِهَا وَلَٰكِنَّهُ أَخْلَدَ إِلَى الْأَرْضِ وَاتَّبَعَ هَوَاهُ ۚ فَمَثَلُهُ كَمَثَلِ الْكَلْبِ إِنْ تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ أَوْ تَتْرُكْهُ يَلْهَثْ ۚ ذَٰلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ
మరియు మేము కోరుకుంటే వాటి (ఆ సూచనల) ద్వారా అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించేవారము. కాని అతడు భూమి వైపునకు వంగాడు, మరియు తన కోరికలను అనుసరించాడు. అతని దృష్టాంతం ఆ కుక్క వలె ఉంది: నీవు దానిని బెదిరించినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది, లేక వదలి పెట్టినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది. మా సూచన (ఆయాత్) లను అబద్ధాలని నిరాకరించే వారి దృష్టాంతం కూడా ఇదే! నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉంటే, బహుశా వారు ఆలోచించవచ్చు
سَاءَ مَثَلًا الْقَوْمُ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَأَنْفُسَهُمْ كَانُوا يَظْلِمُونَ
మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారి దృష్టాంతం చాలా చెడ్డది. ఎందుకంటే వారు తమకు తాము అన్యాయం చేసుకుంటున్నారు
مَنْ يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِي ۖ وَمَنْ يُضْلِلْ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో పడ నిచ్చినవారు! వారే నష్టపోయేవారు

Choose other languages: