Quran Apps in many lanuages:

Surah Al-Ankabut Ayahs #17 Translated in Telugu

وَلَيَحْمِلُنَّ أَثْقَالَهُمْ وَأَثْقَالًا مَعَ أَثْقَالِهِمْ ۖ وَلَيُسْأَلُنَّ يَوْمَ الْقِيَامَةِ عَمَّا كَانُوا يَفْتَرُونَ
మరియు నిశ్చయంగా, వారు తమ బరువులను మోస్తారు మరియు తమ బరువులతో పాటు ఇతరుల బరువులను కూడా మోస్తారు. మరియు నిశ్చయంగా, వారు పునరుత్థాన దినమున, తమ బూటక కల్పనలను గురించి ప్రశ్నింపబడతారు
وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا فَأَخَذَهُمُ الطُّوفَانُ وَهُمْ ظَالِمُونَ
మరియు వాస్తవానికి, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. అతను వారి మధ్య యాభై తక్కువ వేయి సంవత్సరాల వరకు (వారిని అల్లాహ్ ధర్మం వైపుకు ఆహ్వానిస్తూ) నివసించాడు; చివరకు వారు దుర్మార్గాన్ని విడనాడనందుకు, వారిని తుఫాను పట్టుకున్నది
فَأَنْجَيْنَاهُ وَأَصْحَابَ السَّفِينَةِ وَجَعَلْنَاهَا آيَةً لِلْعَالَمِينَ
తరువాత మేము అతనిని (నూహ్ ను) మరియు నావలో ఎక్కిన వారిని రక్షించి, దానిని సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము
وَإِبْرَاهِيمَ إِذْ قَالَ لِقَوْمِهِ اعْبُدُوا اللَّهَ وَاتَّقُوهُ ۖ ذَٰلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) ఇలాగే ఇబ్రాహీమ్ కూడా తన జాతి వారితో: కేవలం అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు అర్థం చేసుకోగలిగితే, ఇది మీకు ఎంతో మేలైనది
إِنَّمَا تَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ أَوْثَانًا وَتَخْلُقُونَ إِفْكًا ۚ إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِنْدَ اللَّهِ الرِّزْقَ وَاعْبُدُوهُ وَاشْكُرُوا لَهُ ۖ إِلَيْهِ تُرْجَعُونَ
నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదలి విగ్రహాలను ఆరాధిస్తూ, ఒక అభూత కల్పన చేస్తున్నారు. నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, ఆరాధిస్తున్నారో, వారికి మీకు జీవనోపాధిని సమకూర్చే యోగ్యత లేదు. కావున మీరు, మీ జీవనోపాధిని అల్లాహ్ నుండియే అపేక్షించండి మరియు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనకే కృతజ్ఞులై ఉండండి. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు

Choose other languages: